ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని గ్రామాల్లోని రైతులు గురువారం బంద్ కు పిలుపు నిచ్చారు. ఏపీకి మూడు రాజధానులంటూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి  ప్రకటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసనల్లో భాగంగా రిలే దీక్షలు, రహదారుల ముట్టడికి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆందోళనలో అన్ని గ్రామాల రైతులు పాల్గొంటారని నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. రాజధాని గ్రామాల్లో  బంద్ పాటించాలని రైతులు నిర్ణయించారు.  

ఏపీకి మూడు రాజధానులంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించడం పట్ల అమరావతి ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం  రైతులు నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, పరిపాలన విభాగం అంతా అమరావతిలోనే ఉండాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, హైకోర్టు కర్నూలులో ఉండాలనేది భారతీయ జనతాపార్టీ మొదటి నుంచి చెబుతోందని అన్నారు. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఒకచోట, పరిపాలన ఇంకోచోట తగదంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రైతులు ఉద్దండరాయనిపాలెంలో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై రాజధాని సమాలోచనలు జరిపారు. ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం చేసిన ప్రకటనపై తీవ్రంగా స్పందించారు.

రాజధానిపై సీఎం ప్రకటన బీజేపీకి అవకాశమిచ్చినట్లేనని పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్ రెచ్చగొట్టినట్లే.. ఏపీలో జగన్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు. రాయలసీమ అభివృద్ధి పేరుతో బీజేపీ గతంలోనే ప్రణాళిక ప్రకటించిందన్నారు. విజయసాయిరెడ్డి సహా వైసీపీ నేతలంతా వైజాగ్‌లో పెట్టుబడులు పెట్టారని, అందుకే వైజాగ్‌ రాజధాని అంటున్నారని కుటుంబరావు ఆరోపించారు. కాగా, గంటా శ్రీనివాసరావు, కేఈ కృష్ణమూర్తి రాజకీయ కారణాలతోనే జగన్ ప్రకటనను స్వాగతిస్తున్నారన్నారు. సీఎం ప్రకటనపై కేంద్రం స్పందించాలని కోరారు. రాజధాని గ్రామాల్లో రేపు బంద్ పాటించాలని రైతులు పిలుపు నిచ్చారు. నిరసనల్లో భాగంగా రిలే దీక్షలు, రహదారుల ముట్టడి చేపట్టాలని తీర్మానం చేసుకున్నారు. మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ.. ఆందోళనలో పాల్గొనాలని అన్ని గ్రామాల రైతులు నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: