జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి రాజధాని మార్పు అంశం తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. రాజధాని మార్పుపై  విపక్ష పార్టీల నుంచి జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ లో  మూడు రాజధానిలు  ఏర్పాటు చేయడం జరుగుతుంది జగన్ అసెంబ్లీలో వ్యాఖ్యానించడం తో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేగింది. ఎవరూ ఊహించని విధంగా జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో మూడు రాజధానిలో అంశాన్ని తెరమీదకు తీసుకురావడంతో.. ప్రస్తుత విపక్ష పార్టీలన్నీ ఉక్కిరిబిక్కిరవుతున్నాయి . ఇక  అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులందరూ జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

 

 

 

 ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ నేతలు రాజధాని అమరావతి ప్రాంతానికి వెళ్తున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానిలో ప్రకటనతో రాజధాని అమరావతి రైతుల్లో భయం నెలకొందని... జనసేన పార్టీ   రైతులందరికీ ధైర్యం చెప్పేందుకు నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జనసేన నేతలు... శుక్రవారం రోజున అమరావతికి వెళ్తారని పవన్ కళ్యాణ్  ట్విట్టర్ వేదికగా తెలిపారు. రాష్ట్రం బాగు పడాలని అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో మూడు పంటలు పండే భూమిని  రాజధాని కోసం రైతులు తమ పంట పొలాలను త్యాగం చేశారని పవన్ కళ్యాణ్ తెలిపారు. 

 

 

 పచ్చటి పంట పొలాలను ఇచ్చి  కేవలం రాష్ట్ర రాజధాని కోసం... రాష్ట్ర భవిష్యత్తు కోసం అమరావతి రైతులు ఇదంతా చేశారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. కానీ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే.. రాజధాని మార్పు చేస్తామంటూ గందరగోళం సృష్టించిందని పవన్ కళ్యాణ్  ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో మూడు రాజధానిల ఏర్పాటు చేస్తానంటూ చేసిన ప్రకటనతో  అమరావతి రైతులు భయాందోళనలు నెలకొన్నాయని పవన్ కళ్యాణ్  పేర్కొన్నారు. రాజధాని పై ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చేంత వరకు వేచి చూద్దాం అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలో పొందుపరిచిన నిర్ణయాలను బట్టి.. ఎలా స్పందించాలి అన్న నిర్ణయం తీసుకుందామని  అమరావతి రైతులు సహా జనసేన కార్యకర్తలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: