ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్‌గా ఉన్న విషయం ఏదైనా ఉందంటే అది...సీఎం జగన్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలని ప్రకటించడమే. కర్నూలు, విశాఖపట్నం, అమరావతిలని మూడు రాజధానులుగా చేయాలని అనుకుంటున్నారు. ఇక ఇందులో కర్నూలు-జ్యుడీషియల్ క్యాపిటల్, అమరావతి-లెజిస్లేటివ్ క్యాపిటల్, విశాఖ-ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేయాలని చూస్తున్నారు. అయితే జగన్ ప్రకటనపై రాష్ట్ర వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే...మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ అభిప్రాయాలు ప్రాంతాల వారీగా వస్తున్నాయి. ఇందులో రాయలసీమ వాసులు కర్నూలని జ్యూడిషయల్ క్యాపిటల్ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం అమరావతిలోనే ఉంటే తమకు అన్యాయం జరిగేదని, కానీ జగన్ ఇలా ప్రకటించడం స్వాగతించాల్సిన విషయమని సీమ వాసులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇటు విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడం పట్ల కూడా ఉత్తరాంధ్ర ప్రజలకు సంతోషంగా ఉన్నారు.

 

దీని వల్ల తమ ప్రాంతం అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆ ప్రాంతం వారు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ విధంగా సీమ, ఉత్తరాంధ్ర వాసులు ఆనందం వ్యక్తం చేస్తుంటే, కోస్తా వాళ్ళు మాత్రం ఈ నిర్ణయంపై కొంత అసంతృప్తిగా ఉన్నట్లు కనపడుతుంది. అమరావతి ప్రాంతానికి అటు ఇటుగా ఉన్న ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల వాళ్ళు ఈ నిర్ణయాన్ని స్వాగతించలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే అమరావతి కేవలం లెజిస్లేటివ్ క్యాపిటల్‌కే పరిమితం అవ్వడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు పెద్ద ఉపయోగం ఉండదని అనుకుంటున్నారు.

 

ఏదో అసెంబ్లీ సమావేశాలు కొన్ని రోజులు జరుగుతాయి తప్ప. దాని వల్ల ఈ ప్రాంతాల్లో అనుకున్న మేర అభివృద్ధి జరగదని భావిస్తున్నారు. హైకోర్టు లేకపోయిన...పాలన పరమైన వ్యవహారాలు సమబంధించినవి అమరావతిలో లేకపోతే దీనికి పెద్ద విలువ ఉండదని అనుకుంటున్నారు. అటు అమరావతి రైతులు కూడా కొంచెం ఇబ్బందులు పడే అవకాశముంది. ఇప్పటికే వారు రోడ్ల మీదకొచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఏదేమైనా జగన్ నిర్ణయం పట్ల రాయలసీమ,ఉత్తరాంధ్ర ప్రజలు సంతోషంగా ఉంటే... కోస్తా ప్రజలు కాస్త అసంతృప్తిగానే ఉన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: