ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంత ప్రజలకు జనసేన ఎప్పుడూ భరోసాగా నిలుస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన  ట్విట్టర్ వేదికగా రాజధాని అంశంపై జనసేన విధి విధానాలను వెల్లడించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, స్థానికుల్లో నెలకొన్న భయాందోళనల గురించి కమిటీ తెలుసుకోనున్నట్టు పేర్కోనున్నారు. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సారధ్యంలో ఈ కమిటీ పర్యటించనుంది. ఇందులో పీఏసీ కమిటీ సభ్యులు, పార్టీ నేతలు కూడా ఉంటారు. రాజధాని గ్రామాలలో నాదెండ్ల సారధ్యంలోని కమిటీ శుక్రవారం నాడు పర్యటించనుంది.  రాజధానిపై నిపుణుల కమిటీ నివేదిక వచ్చేవరకూ అనుసరించాల్సిన కార్యాచరణను ఈ బృందం రైతులతో చర్చిస్తుందని పవన్ తెలిపారు.


మంత్రి జ్తష్స్ ట్విస్ట్.. 
ఏపీ నూతన రాజధాని అమరావతి అంశంలో నెలకొన్న వివాదంపై జనసేన కమిటీని ఏర్పాటు చేసింది. ఓ వైపు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల గురించి ప్రకటన చేస్తే మంత్రి పేర్ని నాని మాత్రం కొత్త ట్విస్ట్ ఇచ్చారు. సీఎం సభలో ఉండొచ్చు…జరగొచ్చు అని మాత్రమే చెప్పారని..కమిటీ నివేదికలో అలా ఉండే అవకాశం ఉందని మాత్రం ప్రకటించారన్నారు. ఏదైన విషయం ఉంటే థైర్యంగా  చెప్పగల నాయకుడు జగన్ అని పేర్కొన్నారు. 


ప్రజల ఆకాంక్షలు కమిటీలో ప్రతిఫలిస్తాయని..దానికి అనుగుణంగానే నిర్ణయం ఉంటుందని తెలిపారు. మంత్రి పేర్ని నాని బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమరావతిలో అక్రమాలు బయటపడతాయని తెలుగుదేశం పార్టీ భయపడుతోందని మంత్రి పేర్ని నాని విమర్శించారు. రాజధానిపై చర్చ జరగడం ఇష్టం లేకపోతే.. అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేయొచ్చు కదా అని అన్నారు. అమరావతిపై చర్చ జరిగితే టీడీపీ నేతలను..బట్టలు లేకుండా ప్రపంచానికి చూపిస్తామని చంద్రబాబు భయపడుతున్నారని మంత్రి పేర్ని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: