ఎప్పుడు లేని విధంగా తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జగన్ ప్రభుత్వం 20 బిల్లులని అమలు చేసిన విషయం తెలిసిందే. ప్రజలకు మేలు చేయడమే భాగంగా ఈ బిల్లులని తీసుకొచ్చారు. ఇందులో తెలంగాణలో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకొని, నిందితులకు కఠిన శిక్ష త్వరితగతిన పడేలా సీఎం జగన్ దిశ చట్టం తీసుకొచ్చారు. ఈ బిల్లు పట్ల మన రాష్ట్ర ప్రజలతో పాటు... ఇతర రాష్ట్రాల వారు కూడా సీఎం జగన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక దిశ బిల్లుతో పాటు పలు కీలక బిల్లులని ఆమోదించారు.

 

అయితే 20 బిల్లులు ఆమోదం పొందిన రెండు కీలక బిల్లులు మాత్రం ఆమోదం పొందలేదు. ప్రతి పేద పిల్లలకు ఉపయోగపడేలా తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం బిల్లు ఒకటి... ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి ఉపయోగపడేలా వేర్వేరు కమిషన్లు ఉండేలా తీసుకొచ్చిన బిల్లులు ఆమోదం పొందలేదు. కేవలం శాసన మండలిలో టీడీపీ అడ్డుపడటం వల్లే ఈ రెండు బిల్లులకు ఆమోద ముద్ర పడలేదు. అసెంబ్లీలో వైసీపీకి భారీ మెజారిటీ ఉన్న... మండలిలో మాత్రం టీడీపీకి మెజారిటీ ఉంది. దీంతో అక్కడ టీడీపీ సభ్యులు ఈ రెండు బిల్లులకు అడ్డుపడటంతో ఆగిపోయాయి.

 

అసలు ఈ రెండు బిల్లులకు ఆమోద ముద్రపడితే ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ లకు వేర్వేరు కమిషన్ల ద్వారా వారికి మరింత ఉపయోగం చేకూరనుంది. వారికి మరింత ఎక్కువగా ప్రభుత్వం నుంచి బెన్‌ఫిట్స్ అందుతాయి. అయితే ముందు నుంచి ఎస్సీ, ఎస్టీలు విషయంలో అశ్రద్దగా ఉంటున్న టీడీపీ..ప్రతిపక్షంలో ఉన్న కూడా వారి మేలుకు కృషి చేయడం లేదు. అటు ఇంగ్లీష్ మీడియం వస్తే ప్రతి పేద పిల్లలకు మంచి చదువు అందుతుంది.

 

ఈ పోటీ ప్రపంచంలో వారు ఇంగ్లీష్ మీడియంలో చదవడం వల్ల నిలబడగలుగుతారు. అదే ఉద్దేశంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక దీనికి కూడా టీడీపీ బ్రేక్ వేయడం వల్ల బిల్లు పెండింగ్ లో పడిపోయింది. మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో ఈ బిల్లులని ఆపారో తెలియదు గానీ...దీని వల్ల ప్రజలకు నష్టమైతే జరిగే అవకాశముంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: