ఏపీ మంత్రులలో బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డికి సౌమ్యుడు, తెలివిగలవాడు అని మంచి పేరు ఉంది. ప్రత్యర్థి పార్టీని తన ఎత్తులు పైయెత్తులతో ఇట్టే ఇరుకున పెట్టే సమర్థులు. అయితే మిగతా మంత్రుల్లా ఆగ్రహంగా మాట్లాడకుండా తనదైన శైలిలో కథలు చెప్పి ప్రతిపక్ష పార్టీకి చురకలు అంటిస్తుంటారు బుగ్గన. నిన్న అసెంబ్లీలో రాజధాని అమరావతిపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడి చర్చ నడిచింది. ఈ చర్చ సందర్బంగా బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి చంద్రబాబుపై చెప్పిన హెలికాప్టర్ కథకి సభలోని సభ్యులంతా ఘొల్లున నవ్వారు. 

 

అమరావతిపై చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై "అధ్యక్షా ఒక హెలికాప్టర్లో ఐదుగురు మనుషులు ప్రయాణిస్తున్నారు అందులో ఒక క్రీడాకారుడు, ఒక స్కూల్ పిల్లవాడు, ఒక సైంటిస్ట్, ఒక వృద్ధ వ్యక్తితో పాటు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రయాణిస్తున్నారు. మార్గం మధ్యలో హెలికాప్టర్ కు సాంకేతిక సమస్య వచ్చింది దానితో పైలట్ అందరిని పారాచూట్ సాయంతో కిందకి దిగమ్మన్నాడు. ముందుగా క్రీడాకారుడు తనతో దేశానికి చాలా అవసరం ఉందని కిందకి దిగి వెళ్ళాడు, ఆ తరువాత సైంటిస్ట్ కూడా వెళ్ళాడు. ఇక చంద్రబాబు నాయుడు గారు కూడా కిందకి దిగారు. ఇక ఒకే ఒక పారాచూట్ మిగిలింది వృద్దుడు మరియు స్కూల్ పిల్లాడు.

 

వృద్ధ వ్యక్తి తనకు వయసు అయిపోయిందని తను బ్రతికి వున్నా ఉపయోగం లేదని స్కూల్ పిల్లాడిని పారాచూట్ సాయంతో కిందకి దిగమన్నాడు. స్కూల్ పిల్లాడు రెండు పారాచూట్లు ఉన్నాయని చెప్పాడు. అర్ధం కాని వృద్ధుడు ఎలా ఉన్నాయి రెండు పారాచూట్లు అని అడగగా ఇందాక దిగిన చంద్రబాబు నా స్కూల్ బ్యాగ్ తో దిగాడు అని చెప్పాడు" అంటూ చంద్రబాబు అమరావతిపై వ్యవహరించిన తీరు గురించి బుగ్గన ఈ కథ రూపంలో సభ కి తెలియజేసారు. ఈ కథ విన్న సభ్యులంతా నవ్వారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: