రాష్ట్రం లోని మూడు ప్రాంతాల్లో మూడు రాజధాని నగరాలను ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటనపై, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరహాలోనే  జనసేనాని స్పందించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది . మరోసారి  చంద్రబాబు, పవన్ బంధం ఆయన వ్యాఖ్యలతో , మరోసారి బట్టబయలు అయిందని  నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అచ్చంగా బాబు వ్యాఖ్యలే పవన్ నోటి వెంట రావడం చూస్తుంటే , ఇద్దరు కలిసి  జగన్ కు వ్యతిరేకంగా  పని చేస్తున్నట్లు స్పష్టం అవుతోందని విరుచుకుపడుతున్నారు  . అయితే గతం లో రాజధాని పై  పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అయన యూటర్న్ విధానాన్ని ఎండగడుతున్నారు .

 

 గతంలో కర్నూల్  జిల్లా పర్యటన సందర్బంగా అమరావతి మనకు  రాజధాని కావచ్చు ... కానీ నా మనస్సుకు మాత్రం కర్నూలే రాజధాని అంటూ  పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే .  పవన్ గతం లో చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ ఆ పార్టీ సామాజిక మాద్యం ఖాతాలో ఉన్న విషయాన్ని  నెటిజన్లు గుర్తు చేస్తూ , జనసేనాని విధానాలను తప్పుబడుతున్నారు . రాష్ట్రం లో మూడు రాజధాని నగరాల ఏర్పాటు పై పవన్ స్పందిస్తూ ఒక్క అమరావతికే దిక్కు లేదు .. మూడు అమరావతులు సాధ్యమేనా ? అంటూ ప్రశ్నించడమే కాకుండా , గతంలో పార్టీ ప్లినరీ లో అమరావతిని రాజధానిగా అంగీకరించిన జగన్ ఇప్పడు క్షమాపణలు చెబుతారా ? అంటూ నిలదీశారు .

 

ఇక రాజధాని అమరావతి ప్రాంతం లో నెలకొన్న పరిస్థితుల్ని అధ్యయనం చేయడానికి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అమరావతి ప్రాంతం లో ఈనెల 20 వ తేదీన పర్యటించాలని నిర్ణయించింది . జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ నేతృత్వం లోని కమిటీ సభ్యులు రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటించి , రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల్ని కలుసుకుంటాయి పవన్ కళ్యాణ్ వెల్లడించారు . రాజధానిపై నిపుణుల కమిటీ నివేదిక వచ్చే వరకూ వేచి చూద్దామని పవన్ జనసైనికులకు పిలుపునిచ్చారు .    

మరింత సమాచారం తెలుసుకోండి: