ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి భద్రతను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది . ఆర్గనైజేషన్ ఫర్ యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్స్  (ఆక్టోపస్ ) బృందాన్ని ముఖ్యమంత్రి భద్రత విభాగం లో చేర్చారు . ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి   సెక్యూరిటీ ఫోర్స్ లో కొత్తగా ఆక్టోపస్ ను చేర్చినట్లు చీఫ్ సెక్యూరిటీ అధికారి ఈ మేరకు వెల్లడించారు . జగన్ కి ఐదు బృందాలుగా మొత్తం 32 మంది ఆక్టోపస్ సిబ్బంది భద్రత కల్పించనున్నారని అయన పేర్కొన్నారు  .

 

 ఈ బృందం జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా, అక్కడకు వెళ్లి భద్రత కల్పించనుంది . ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి పై గతం లో దాడి జరిగిన విషయం తెల్సిందే .  ముఖ్యమంత్రి హోదాలో  జగన్ కు భద్రత పెంచగా , ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడుకు భద్రతను కుదించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెల్సిందే . ఒక ప్రతిపక్ష నేతకు కల్పించాల్సిన భద్రత కంటే అదనపు సిబ్బంది ని ఆయనకు  కేటాయించినట్లు గతం లో రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి . అయినా చంద్రబాబు తన భద్రతను కుదించారని ఆందోళన వ్యక్తం చేస్తూ,  రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే . బాబుకు యధావిధిగా భద్రత కొనసాగించాలని హైకోర్టు ఆదేశించడం తో , గతం లో ఉన్న భద్రత సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం  కొనసాగిస్తోంది .

 

ఇక బాబు కుటుంబానికి మాత్రం భద్రతను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది . ముఖ్యమంత్రి హోదా లో ఉన్న వారికి అదనపు భద్రత పెంచడం అన్నది రొటీన్ కార్యక్రమమని , ఇందులో పెద్దగా విశేషమేని లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం భద్రతను గతం లో కంటే పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకుంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: