భ‌క్తి పేరుతో ప్ర‌జ‌ల్లో చెలామ‌ణి అయ్యే బాబాలు, స్వాములు స‌హా ఇత‌రుల విష‌యంలో ఎన్ని ఉదంతాలు జ‌రుగుతున్నా...ఎంద‌రో మోస‌పోతూనే ఉన్నారు. అలా మోస‌పోయే ప్ర‌జ‌ల ఆమాయ‌క‌త్వాన్ని ఆస‌రాగా చేసుకొని ఓ బాబా ఈజీగా 40 కోట్లు కొట్టేశాడు. ఇంత‌కీ ఆయ‌న ఏం చ‌దివాడో తెలుసా? ఇంట‌ర్ ఫెయిల్‌...ఆయ‌న‌కు భ‌క్తులు స‌మ‌ర్పించుకునే గిఫ్టుల విలువ క‌నీసం ల‌క్ష‌. ఈ దొంగ‌బాబా ఎక్క‌డి వాడో కాదు. మ‌న ఏపీకి చెందినవాడే. 

 


నెల్లూరుకు చెందిన గిరీష్‌ సింగ్‌ ఆధ్యాత్మికతను బోధించడం ప్రారంభించి సోదరుడు దిలీప్ సింగ్‌తోపాటు ‘అద్వైత ఆధ్యాత్మిక రీఛార్జ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్’ (ASRCE) ను ప్రారంభించాడు. అద్వైత స్పిరిచువల్ రీఛార్జ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ చీఫ్ గిరీష్ సింగ్ కొంతకాలంగా దైవాంశ సంభూతుడిగా చెలామణి అవుతున్నాడు. తనదగ్గరకు వచ్చే వారిలో కొందరిని ఎంచుకుని వారి ఇళ్లలోకి వెళ్లి ఆద్యాత్మిక బోధనలు ఇచ్చేవాడు. దీంతో పాటు..  డ్రీమ్ బ్రిడ్జ్ మనీ సర్క్యూలేషన్ స్కీం పేరుతో నగదును కలెక్ట్ చేయసాగాడు. గొలుసుకట్టు వ్యాపారంలో లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి చివరికి మోసపోయామని గ్రహించి పోలీసుల్ని ఆశ్రయించారు. అయితే, పోలీసుల‌కే ఈ బాబా షాకిచ్చాడు.

 

గత ఏడాదే గిరీష్‌ కుమార్‌ను రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. బెయిల్‌పై విడుద‌లైన ఈ బాబా ఆధ్యాత్మికం ముసుగులో మళ్లీ దందా షురూ చేశాడు.గత ఏడాది గిరీష్ సింగ్  తన అనుచరురాలైన దివ్యను వివాహం చేసుకున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో గిరీష్, దివ్యల వివాహం కోసం ప్రజల నుంచి రూ.3 కోట్ల సేకరించి ఖర్చు చేసినట్లు దర్యాప్తులో తేలింది. మొత్తంగా డ్రీమ్ బ్రిడ్జ్ మనీ సర్క్యూలేషన్ స్కీం పేరుతో పలువురిని మోసం చేసి 40కోట్ల రూపాయలను కాజేశాడు ఈ దొంగ బాబా. మోసపోయామని ఆల‌స్యంగా గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో గిరీష్ సింగ్ ను అరెస్ట్ చేసి చీటింగ్ కేసు నమోదు చేశారు. ఇంటర్‌ ఫెయిల్‌ అయిన గిరీష్‌ కుమార్‌ హిమాలయాన్‌ యూనివర్సిటీ నుంచి నకిలీ డిగ్రీ పట్టా పొందాడు. అయితే తెలుగుతో పాటు ఇంగ్లీష్‌, హిందీ భాషల మీద మంచి పట్టు ఉండటంతో బురిడీ బాబా బుట్టలో ఈజీగా పడిపోయేవాళ్లు. అమ్మాయిలను టార్గెట్ చేసుకొని నేరుగా వెళ్లి కలిసి వాళ్లకి ఆధ్యాత్మిక బోధనలు చెప్పి బుట్టలు వేసుకునేవాడట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: