భూమిపై జీవరాశి జనియించిన కొంగ్రొత్త కాలంలో మనుషులు ఎంతో ఆనందం మరియు సంతోషంతో జీవిస్తూ ఉండేవారు. అయితే రాను రాను రాచరికపు తమ నియంతృత్వ పోకడలతో కొందరు పాలకులు ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేయడం మొదలెట్టారు. వారిలో తారకుడు అనే చక్రవర్తి అయితే మరింత అధికార దాహం మరియు అత్యాశతో ఎందరో రాజులను, వారి రాజ్యాల్లోని ప్రజలను అనేక బాధలు పెట్టసాగాడు. అనంతరం అతడి అహంకారం వలన ముక్కచెక్కలుగా విడిపోయిన భూభాగంపై ప్రజల రోదనలు మిన్నంటాయి. అయితే అతడి అకృత్యాలను భరించలేకపోయిన ప్రజలు సాక్ష్యాత్తు శ్రీమహావిష్ణువుకు మొరపెట్టుకున్నప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. అయితే చివరకు శ్రీమహావిష్ణువు సహకారంతో హిమాలయాల్లో ఘోర తపస్సు చేసే ఆది యోగి ఒక్కడే ఈ సమస్యకు పరిష్కారం చూపగలడని, 

 

కేవలం అతడివల్లే మళ్ళి భూమి పై సామరస్యం, సంతోషం వెల్లువిరవగలవని భావించి ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి సిద్ధం అయ్యారు. అయితే ఆయన ఎన్నో ఏళ్లుగా ఘోర తపస్సు గావిస్తున్న మహిమాన్విత శక్తులు గల సన్యాసి, అలానే అతడి శక్తికి ఎదురెళ్లి నిలబడి సమస్యను వివరించడం, అతడిని తారకుడి వంటి వాడిపైకి యుద్దానికి ప్రేరేపించడం అసాధ్యం అని భావించిన విష్ణు మూర్తి, ఎన్నో మార్లు ఆలోచన చేసిన అనంతరం ఒక గొప్ప తరుణోపాయాన్ని ఆలోచించాడు. అంతటి గొప్ప సన్యాసికి జన్మించిన బిడ్డ మాత్రమే తారకుడిని వధించగలడని భావించి, అతడిని ఒక గృహస్థుడిని చేయాలని సంకల్పించారు. చివరికి కొంత భయంతోనే అతడి తపస్సును భగ్నం గావించి, భూమిపై ప్రస్తుతం ప్రజల పరిస్థితులు, 

 

మరియు ఎదుర్కొంటున్న దురవస్థను వివరించారు. అయితే వారి వ్యధను విన్న ఆదియోగి, తన నుండి ఎటువంటి సాయం కావాలో కోరామన్నాడు. అయ్యా ఈమె పేరు సతీ దేవి, దక్ష ప్రజాపతి కూతురు. ఈమె కేవలం మీకొరకే భూమిపై జన్మించింది. కావున ఈమెను తక్షణమే మీరు వివాహమాడి, ఒక పండంటి బిడ్డను మాకు ప్రసాదిస్తే, ఆతడే తారకుడు సహా ఇతర నీచుల అకృత్యాలను అరికట్టగలడని కోరారు. అయితే భూక్షేమం, మరియు ప్రజా రక్షణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో సతీదేవిని వివాహమాడి ఆదియోగి, అనంతరం శృంగారం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు. ఆ విధంగా ప్రజల సంక్షేమం,శ్రేయస్సు కోడం తన కఠోర తపస్సు దీక్షను విడనాడి, సతీదేవిని వివాహమాడిన సన్యాసి ఆదియోగి గాథ ఇప్పటికీ ఎప్పటికీ మనకు ఆదర్శమే....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: