2019లో తెలంగాణ రాజకీయాలు మొత్తం హాట్ హాట్ గా జరిగాయి . దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని అంటూ కేసీఆర్ కు  ప్రతిపక్షాల సవాలు విసిరే సరికి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు కాలు దువ్వారు . ముందస్తు ఎన్నికలు అంతకుముందు గెలిచిన దానికంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు గెలిచి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది టిఆర్ఎస్ పార్టీ. రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్  పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ  వచ్చింది. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు టీఆర్ఎస్ శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొద్ది మంది ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంది. 

 

 

 

 ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో కారు సారు 16 అనే నినాదంతో టిఆర్ఎస్ పార్టీ ముందుకు సాగింది. కానీ పార్లమెంట్ ఎలక్షన్లో టిఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు టీఆర్ఎస్ అవలంభించిన నియంతృత్వ  విధానాన్ని ప్రజలు గమనించి ముఖ్యంగా పార్లమెంట్ ఎలక్షన్ లలో  నాలుగు స్థానాలు బిజెపి విజయం సాధించింది. ఏకంగా కెసిఆర్ కూతురు నిజాంబాద్ పార్లమెంట్ స్థానంలో ఓడిపోవడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం గా మారినది . అంతేకాకుండా పార్లమెంట్ ఎలక్షన్లో మూడు సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ బోల్తా పడినప్పటికీ లోక్ సభ  ఎన్నికల్లో మాత్రం పుంజుకుని 3 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. అయితే బీజేపీ  అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కేవలం గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే గెలవగా  రాజా  సింగ్ ఎమ్మెల్యే అయ్యారు. పార్లమెంట్ ఎలక్షన్లో మాత్రం ఏకంగా నాలుగు స్థానాల్లో గెలిచింది బిజెపి.

 

 

 

 అయితే పార్లమెంట్ ఎలక్షన్ లలో  పసుపు రైతులందరూ నిజాంబాద్ ఎంపీ కెసిఆర్ కూతురు కవిత కు వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో నామినేషన్లు వేయడం కూడా సంచలనంగా మారింది. అయితే పార్లమెంట్ ఎలక్షన్ లో ఏకంగా కవిత పై ధర్మపురి అరవింద్ 74 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపింది. ఏకంగా కేసీఆర్ ను  దిక్కరించిన టిఆర్ఎస్ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ తనయుడు ధర్మపురి అరవింద్ ఓడించడం గమనార్హం. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ ఏ ప్రతిపక్షం లేకుండా చేసుకుంది . కాగా  ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకుడు అప్పచెప్పాల్సిన పదవిని.. టిఆర్ఎస్ నేతలు మిత్ర  పార్టీ అయిన ఎంఐఎంకు అప్పచెప్పి ప్రతిపక్ష హోదాని ఎంఐఎంకు కట్టబెట్టింది టిఆర్ఎస్ పార్టీ. కాగా తాజాగా తమ 26 డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు  మూడు రోజుల పాటు సమ్మె నిర్వహించి ఒకటి డిమాండ్  కూడా పరిష్కారం కాకుండానే సమ్మెను విరమించారు.సమ్మె  విరమించిన ఆర్టీసీ కార్మికులను కొద్ది రోజులపాటు సస్పెన్స్ లో పెట్టి ఆ తర్వాత విధుల్లోకి తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కాగా  కార్మికులకు 26 రకాల హామీలను ఇచ్చారు.అనంతరం  ఆర్టీసీ టికెట్ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: