ఇటివల  దిశ హత్య కేసు తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దిశ హత్య తరువాత నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసి చంపేసిన విషయం కూడా అందరికి తెలిసినదే. దీనితో దేశమంతా దిశకు న్యాయం జరిగింది అని  మహిళలు రోడ్డుపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు స్వీట్లు పంచుకున్నారు. కానీ నిందితులను ఎన్ కౌంటర్ చేయడం తప్పుగా బావించి వారిపైన మానవహక్కుల సంఘం విచారించారు. అలాగే  చనిపోయిన నిందితులకు కర్మకాండలు కూడా నిర్వహించలేదు. అయితే నిందితుల ఎన్ కౌంటర్ పైన వారి కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం ప్రకారం శిక్షిస్తామని చెప్పి అన్యాయం గా ఎన్ కౌంటర్ చేసారని

పోలీసుల తీరుపై మండిపడ్డారు. చట్టాలున్నాయి ఆ చట్టాలు చూసుకుంటాయి కానీ ఇలా అతి దారుణంగా చంపేయడం ఏమిటని ప్రశ్నించారు నిందితుల కుటుంబ సభ్యులు. ఇదంతా జరుగుతుండగా మానవ హక్కుల కమిషన్ రావడం ఈ వ్యవహారంపై ఆరా తీయడం కూడా జరిగిపోయాయి. వారు చనిపోయిన రోజు నిందితుల్లో ఒకరైన చెన్నకేశవుల భార్య రేణుక ఎన్ కౌంటర్ ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఆమె మీడియాతో మాట్లాడిన  మాటలు చర్చకు దారితీసింది.

నేను ఇప్పుడు గర్భిణిని అని  నా భర్తను చంపేశారు సరే నాకు ఇప్పుడు దిక్కెవరు. అలాగే నాకు పుట్టబోయే బిడ్డకు తండ్రిని ఎవరు తెచ్చిస్తారు ప్రశ్నించింది. చనిపోయిన వారు చంపినా వారు బాగానే ఉన్నారు అని నేను నా పిల్లలే అనాధలయ్యారని బాధపడింది. ఇప్పటివరకు ఇలాంటి హత్యలు జరిగాయి అలాగే ఎంతోమందిని చంపిన వారిని కూడా చట్టం ప్రకారం శిక్షించారు మరి అందరిని ఇలాగే చంపాలని డిమాండ్ చేసింది.కొందరికి ఒక న్యాయం మాకు మరో న్యాయం  ఏంటి అని ప్రశ్నించింది.అలాగే నష్టపరిహారం గా   నతనకు  15 లక్షల రూపాయల డబ్బులు, డబుల్ బెడ్ రూం ఇల్లు ను  ఇవ్వండి అని విజ్ఞప్తి చేసింది. నేను బతకాలి కదా అంటూ ప్రశ్నిస్తోంది. తెలంగాణా ప్రభుత్వాన్ని రేణుక నిలదీస్తోంది. బతుకుతెరువు భారమవుతున్న మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలంటోంది రేణుక. అన్యాయంగా దిశ ను హత్యచేసి నిర్దాక్షిన్యంగా చంపిన వారి కుటుంబానికి సాయం ఎందుకు చేయాలనీ చేయకూడదని అని సూచిస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: