హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం ఎందుకు భద్రతను పెంచింది ? ఇపుడిదే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. జగన్ సిఎం కాగానే ఇంటెలిజెన్స్ భద్రత వ్యవహారాలను చూసుకుంటోంది.  అయితే ఉన్నట్టుంది జగన్ భద్రత కోసం 30 మంది ఆక్టోపస్ దళాలను దించారు.  ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ (ఆక్టోపస్) దళాలను ఇంత అర్జంటుగా దింపాల్సిన అవసరం ఏం వచ్చిందన్నదే సస్పెన్సుగా మారింది.

 

ఈ ఆక్టోపస్ భద్రతా సిబ్బందే షిఫ్టుకు ఆరుమంది చొప్పున 24 గంటలూ కాపలాగ ఉంటారు. అంటే ఇపుడున్న ఇంటెలిజెన్స్ భద్రతకు ఆక్టోపస్ భద్రత అదనంగా ఉంటుందన్నమాట. మొత్తం ఐదుషిఫ్టుల్లో ఆక్టోపస్ భద్రత కంటిన్యు అవుతుంది. ఈ ఆక్టోపస్ భద్రత సిఎంను అంటిపెట్టుకునే ఉంటాయి. సభలు, సమావేశాలు, ప్రారంభోత్సవాలు ఇలా ఎక్కడికెళ్ళినా ఈ భద్రత కంటిన్యు అవతునే ఉంటుంది.

 

అంతా బాగానే ఉందికాని ఇంత హఠాత్తుగా అదనంగా ఆక్టోపస్ భద్రతను ఉన్నతాధికారులు ఎందుకు ఏర్పాటు చేసినట్లు ? జగన్ ఏమీ మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్న వ్యక్తేమీ కాదు. అలాగని జగన్ పై  మావోయిస్టుల  దాడి జరక్కూడదని ఏమీ లేదనుకోండి అది వేరే సంగతి. చాలా కాలంగా స్తబ్దుగా ఉన్న మావోయిస్టు దళాలు సంచలనం కోసం ఎవరిపైన దాడి చేయటానికైనా వెనకాడరన్న విషయం అందరికీ తెలిసిందే.

 

సరే  ఆ విషయాన్ని పక్కనపెట్టేస్తే  మొన్ననే ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో జగన్  ఏపికి మూడు రాజధానుల ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే. జగన్ ఎప్పుడైతే ప్రతిపాదన చేశారో అప్పటి నుండే రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాల్లో సంచలనంగా మారింది.  జగన్ ప్రకటనపై చంద్రబాబునాయుడుతో పాటు టిడిపి నేతలు  పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.

 

ఇదే సమయంలో రాజధాని ప్రాంతంలోని టిడిపి రైతులందరూ భారీ ఆందోళనలకు రెడీ అవుతున్నారు. రాజధాని ప్రాంతంలో బంద్ కు కూడా పిలుపిచ్చారు. జగన్ ప్రకటనకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుపుతున్న వారిలో ఎవరైనా ఎటాచ్ చేసే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారా ? అన్న విషయం తెలియాల్సుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: