ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. డిగ్రీలు పూర్తి చేసినా సరైన స్కిల్స్ లేక నిరుద్యోగులు గా మిగిలి పోతున్న వారి కోసం జగన్ ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయంచామన్నారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25 నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుపై చర్చించారు.

 

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడంలో భాగంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ ఏర్పాటు కావాలని సూచించారు. తిరుపతిలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ ఏర్పాటు వల్ల  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యకలాపాలపై   ఏం జరుగుతోందన్నదానిపై ఒక అవగాహన ఉంటుందన్నారు. సమీక్షించడం, పర్యవేక్షించడం సులభతరం అవ్వడమే కాకుండా అవినీతికి ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లలో ఏ అంశాలపై శిక్షణ ఇవ్వాలన్నదానిపై ఈ యూనివర్సిటీ నిర్ణయిస్తుందని చెప్పారు. అప్పుడే ఏయే కేంద్రాల్లో ఏ తరహా శిక్షణ దొరుకుతుందన్న దానిపై విద్యార్థులకు పూర్తి స్థాయి అవగాహన ఉంటుందని, దీనివల్ల పటిష్టమైన ఒక వ్యవస్థ ఏర్పడుతుందని సీఎం పేర్కొన్నారు. 

 

ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.ఒకే గొడుగు కిందకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలు తీసుకు రావాలని కోరారు. పిల్లలకు ప్రయోజనకరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు.

 

ఆయన ఇంకా ఏమన్నారంటే... " మనం ఇచ్చే నైపుణ్య శిక్షణ ఉద్యోగం వచ్చేలా ఉండాలి ..మంచి మౌలిక సదుపాయాలు కల్పించి,మంచి బోధకులను రప్పించాలి. నైపుణ్యాభివృద్ధి కోసం ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలతో అనుసంధానం కావాలి. ఉదాహరణకు కారు రిపేరులో శిక్షణ ఇవ్వాలనుకుంటే మెర్సిడెజ్‌ బెంజ్‌తో శిక్షణ ఇప్పించాలి. దీనివల్ల నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో ఇచ్చే శిక్షణకు ప్రపంచ దేశాల్లో మంచి విలువ ఉంటుంది.. అన్నారు  సీఎం వైఎస్‌ జగన్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: