+ దేశంలో ఈ ఏడాది ఏప్రిల్‌-మే మ‌ధ్య జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మ‌రోసారి బీజేపీ స‌త్తా చాటింది. అనేక వ్య‌తిరేక‌త‌లు ఉన్నా కూడా న‌రేంద్ర మోడీ స‌ర్కారునే ప్ర‌జ‌లు భారీ మెజారిటీతో రెండో సారి అధికారంలోకి తీసుకుచ్చారు.
+ కేంద్రంలో బీజేపీ స‌త్తా చాటినా.. రాష్ట్రాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో మాత్రం బీజేపీ త‌న స‌త్తా చాట‌లేక పోయింది.
+ అనేక రాష్ట్రాల్లో సంకీర్ణ ప్ర‌భుత్వాల‌ను మాత్ర‌మే ఏర్పాటు చేయ‌గ‌లిగింది.

 

+ ముఖ్యంగా ఉత్త‌రప్ర‌దేశ్‌లో బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటు అవుతుంద‌ని అనుకున్నా.. శివ‌సేన‌తో సీట్ల స‌ర్దుబాటులో చ‌ర్చ‌లు బెడిసి కొట్ట‌డంతో అధికారం అందిన‌ట్టే అంది.. పోయింది.
+ మ‌హార‌ష్ట్రలో శివ‌సేన అధికారంలోకి రావ‌డం, బాల‌ఠాక్రే కుమారుడు ఉద్ద‌వ్ ఠాక్రే అధికారంలోకి వ‌చ్చి రికార్డు సృష్టించారు.

 

+ ఏపీ విష‌యానికి వ‌స్తే.. సుదీర్ఘ రాజ‌కీయ అనుభవం ఉన్న టీడీపీ అధినేత‌కు ఇంటా బ‌య‌టా కూడా ఇబ్బంది ప‌రిస్థితి ఏర్ప‌డింది.
+ ఏపీలో రెండో సారి అధికారంలోకి వ‌ద్దామ‌ని అనుకున్న చంద్ర‌బాబుకు శృంగ‌భంగ‌మైంది. ఆయ‌న పార్టీ ఓట‌మి పాలైంది.
+ అనూహ్య ప్ర‌జావిజ‌యాన్ని సొంతం చేసుకున్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. 151 మంది ఎమ్మెల్యేల‌తో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు.

 

+ కేంద్రంలో కాంగ్రెస్ పూర్తిస్థాయిలో చ‌తికిల ప‌డిపోయింది.
+ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాహుల్ గాంధీ ఈ ఏడాది రాజీనామా చేశారు.
+ జ‌మ్ము క‌శ్మీర్‌కు స్వ‌యం ప్ర‌తిప‌త్తి క‌ల్పించే ఆర్టిక‌ల్ 350ని కేంద్రం ర‌ద్దు చేయ‌డంతోపాటు ఈ రాష్ట్రాన్ని రెండుగా విభ‌జించింది.
+ తాజాగా ఈఏడాదిలో కేంద్రం తీసుకున్న కీల‌క నిర్ణ‌యం పౌర‌స‌త్వ బిల్లు స‌వ‌ర‌ణ‌.దీనివ‌ల్ల విదేశాల నుంచి వ‌చ్చే ముస్లింయేత‌ర శ‌ర‌ణార్థుల‌కు భార‌త్ పౌర‌స‌త్వం ఇవ్వ‌నుంది.

 

+ పాకిస్థాన్‌తో ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో పోరాడుతున్న కేంద్రం ప్ర‌భుత్వానికి ఈ ఏడాది ప్ర‌పంచం బాస‌ట‌గా నిలవ‌డం చ‌రిత్ర సృష్టించింది.
+ ఏపీలో జ‌గ‌న్ త‌న ఆరు మాసాల పాల‌న‌లో మెరుపులు మెరిపిస్తున్నారు. అనేక సంక్షేమ ప‌థ‌కాలు, కీల‌క చ‌ట్టాల‌తో దూసుకుపోతున్నారు.
+ఏదేమైనా భార‌త రాజ‌కీయం యేడాది చివ‌రి వ‌ర‌కు బీజేపీ వైపు మొగ్గినా చివ‌ర్లో ఆ పార్టీకి కాస్త ఇబ్బంది త‌ప్ప‌లేదు


 

మరింత సమాచారం తెలుసుకోండి: