ఈ యేడాది ఏపీలో రాజ‌కీయంగా అనూహ్య‌మైన మార్పులు సంభవించాయి. ఐదేళ్ల పాటు ఎన్నో అవినీతి, అరోప‌ణ‌ల్లో కూరుకుపోయిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయారు. 40 సంవ‌త్స‌రాల రాజ‌కీయ చ‌రిత అని గొప్ప‌గా చెప్పుకునే చంద్ర‌బాబుకు ఏపీ ప్ర‌జ‌లు చుక్క‌లు చూపించారు. ఘోరంగా ఓడించి ఇంట్లో కూర్చోపెట్టారు. ఇప్పుడు ఏపీలో అంతా న‌వ‌శ‌కం.. నవ యువ‌నేత పాల‌న ప్రారంభ‌మైంది.

 

+ అనూహ్య‌మైన మెజారిటీతో వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది.
+ అనేక విధాలుగా వ్య‌తిరేక ప్ర‌చారం సాగినా.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను ప్ర‌జ‌లు సీఎంగా ఆమోదించ‌డం ఈ ఏడాది రాజ‌కీయాల్లో స‌రికొత్త మెరుపు. ఆయ‌న‌కు 151 మంది ఎమ్మెల్యేల‌ను ప్ర‌జ‌లు అందించారు.
+ రెండో సారి అధికారంలోకి రావాల‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న చంద్ర‌బాబుకు నిరాశే మిగిలింది. ఆయ‌న ఘోరంగా ఓడిపోయారు.
+పార్టీ చ‌రిత్ర‌లోనే లేనంత ఘోరంగా కేవ‌లం 23 సీట్ల‌తో స‌రిపెట్టుకుంది.

 

+ అదేస‌మ‌యంలో మార్పు కోసంరాష్ట్రంలో స‌రికొత్త రాజ‌కీయాలు చేయాల‌ని భావించిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్ని విధాలా ప్ర‌జ‌ల మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్ట‌డంలో విఫ‌ల‌మ‌య్యారు.
+ ఒక పార్టీ అధినేత ఏకంగా రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓడిపోయిన రికార్డును జ‌న‌సేనాని ప‌వ‌న్ త‌న ఖాతాలో వేసుకున్న‌ది కూడా ఈ ఏడాదే కావ‌డం గ‌మ‌నార్హం.

 

+ అంతో ఇంతో పుంజుకుంటుంద‌ని భావించిన  కాంగ్రెస్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది.
+ ఇక‌, గ‌త 2014 ఎన్నిక‌ల్లో పొత్తుతో నాలుగు స్థానాల్లో విజ‌యం సాధించిన బీజేపీ ఈఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఒంట‌రిపోరుతో ఉన్న ప‌రువును సైతం పోగొట్టుకుంది.
+ రాజ‌ధాని విష‌యంలో ఈ ఏడాది అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అమ‌రావ‌తిపై ఇప్ప‌టికీ స‌స్పెన్స్ కొన‌సాగుతూనే ఉంది.

 

+ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో తెలుగు మీడియంను ర‌ద్దు చేస్తూ.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.
+ జ‌గ‌న్ త‌న మంత్రి వ‌ర్గంలో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు లేన‌న్ని డిప్యూటీ సీ ఎం ప‌ద‌వులు సృష్టించి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మ‌హిళా వ‌ర్గాల‌కు అవ‌కాశం క‌ల్పించి రికార్డు సృష్టించారు.
+ సంక్షేమం, అభివృద్ధి రెండు చ‌క్రాలుగా ఏపీలో ప్ర‌భుత్వం పాల‌న సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: