విశాఖ.. ఇప్పుడు ఏపీ లో ఈ నగరం హాట్ టాపిక్ అయింది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ ఉండొచ్చని ఏపీ సీఎం జగన్ అసెంబ్లీ లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జగన్ విశాఖకు మరో వరం ప్రకటించారు. అదే  హై ఎండ్ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ.. దీన్ని విశాఖలో ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించారు.

 

బుధవారం జగన్ తన క్యాంపు కార్యాలయంలో స్కిల్ డెవలప్మెంట్ పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవ ఒకటి చొప్పున 25 నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుపై చర్చించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడంలో భాగంగా హై ఎండ్ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ ఏర్పాటు కావాలని సూచించారు.

 

జగన్ ఇంకా ఏమి అన్నారంటే.. " ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలి.ఒకే గొడుగు కిందకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్ర తీసుకు రావా లి. పిల్లలకు ప్రయోజనకరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు.

 

 ఒక్కో పార్లమెంట్‌ పరిధిలో పాలిటెక్నిక్‌ కాలేజీలను గుర్తించి వాటిని నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా మార్చాలని సూచించారు. ఇంజినీరింగ్, డిప్లమా, ఐటీఐ పూర్తిచేసిన వారికి శిక్షణ ఇవ్వాలన్నారు. హై అండ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వర్సిటీ తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రోబోటిక్స్, ఆర్టిఫిషీయల్, ఇంటెలిజెన్స్‌ స్కిల్స్‌పై శిక్షణ ఇవ్వాలని సూచించారు.

 

హైఎండ్‌ స్కిల్‌ వర్సిటీ పని తీరు ఇలా ఉంటుంది. నైపుణ్యవంతులను మరింతగా తీర్చి దిద్దుతారు. రోబోటిక్స్‌లో ప్రపంచంతో పోటీ పడేలా శిక్షణ..ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై పట్టు సాధించేలా కసరత్తు.. విదేశీ కంపెనీల్లో ఉద్యోగాలొచ్చేలా అదనపు నైపుణ్యాలు సమకూర్చడం.. ఇదీ హై ఎండ్ యూనివర్సిటీ ప్రణాళిక. ఏపీలో డిగ్రీలు చేత పట్టుకుని ఎలాంటి స్కిల్స్ లేక నిరుద్యోగులు గా మిగిలి పోతున్న యువత కు జగన్ నిర్ణయం వరం గా మారనుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: