+ సీఎం య‌డియూర‌ప్ప‌:  కేవలం 17 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు లేక పోవ‌డంతో ఒక‌సారి కోల్పోయిన అధికారాన్ని ఆయ‌న ఈ ఏడాది తిరిగి పొందారు. బీజేపీని ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేలా కృషి చేశారు. సీఎం పీఠాన్ని ప‌దిలం చేసుకున్నారు.
+ కుమార‌స్వామి:  విఫ‌ల‌మైన సీఎంగా గుర్తింపు పొందారు. ఆదిలో ఏర్ప‌డిన కాంగ్రెస్‌-జేడీఎస్ కూట‌మిని స‌మ‌ర్ధంగా న‌డిపించుకోలేక పోయారు. ఆయ‌న పాల‌న న‌డిపిన‌న్నాళ్లు అష్ట‌క‌ష్టాలు ప‌డ్డారు.
+ దేవెగౌడ‌: ఈ ఏడాది జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో తుముకూరు నుంచి పోటీ చేసి ఓట‌మి. ఆయ‌నతో పాటు మ‌న‌వ‌డు కూడా ఓట‌మిపాల‌య్యారు.

 

+ సుమ‌ల‌త‌:  మాజీ సినిమా హీరోయిన్ సుమ‌ల‌త ఈ ఏడాది జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో మాండ్య నుంచి విజ‌యం సాధించారు. అది కూడా అప్ప‌టి సీఎం కుమార‌స్వామి కుమారుడు నిఖిల్‌పై విజ‌యం సాధించ‌డం గ‌మ‌నార్హం.
+ అంబ‌రీష్‌:  ప్ర‌ముఖ సినీ న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడు, సుమ‌ల‌త భ‌ర్త‌గా ప్రాచుర్యం పొందిన అంబ‌రీష్‌ ఈ ఏడాది అనారోగ్య కార‌ణంగా మృతి చెందారు.
+ డీకే శివ‌కుమార్‌:  కాంగ్రెస్ ట్ర‌బుల్ షూట‌ర్‌గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి డీకే శివ‌కుమార్.. ఐటీ స‌హా ఈడీ కేసుల్లో చిక్కుకుని కొన్ని రోజులు జైలు జీవితం గ‌డిపారు.

 

+నిఖిల్‌కుమార్ గౌడ‌:  మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి రాజ‌కీయ వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ మండ్య‌లో సీనియ‌ర్ హీరోయిన్ సుమ‌ల‌త చేతిలో ఘోరంగా ఓడిపోయాడు
+బ‌ళ్లారి శ్రీరాములు: మ‌ంత్రి బ‌ళ్లారి శ్రీరాములు ప్ర‌స్తుతం బీజేపీ ప్ర‌భుత్వంలో కీల‌క నేత‌గా ఉన్నా ఆయ‌న కంచుకోట అయిన బ‌ళ్లారిలో ఆయ‌న హ‌వా త‌గ్గిపోయింది. ఆయ‌న చిత్ర‌దుర్గ జిల్లాలోని మెల‌కాళ్లూరు నుంచి ఎమ్మెల్యేగా ఉండ‌డంతో బ‌ళ్లారిలో ఆయ‌న హ‌వా త‌గ్గిందంటున్నారు.

 

+ కేఆర్ ర‌మేష్ కుమార్‌:  కుమార స్వామి-కాంగ్రెస్ కూట‌మి ప్ర‌భుత్వ స‌మ‌యంలో అసెంబ్లీ స్పీక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన ర‌మేష్ కుమార్‌.. కుమార‌స్వామి ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఉపసంహ‌రించుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 17 మందిని అన‌ర్హులుగా ప్ర‌క‌టించి దేశ‌వ్యాప్తంగా వార్త‌ల్లో నిలిచారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: