ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అనేక సంఘటనలు వైరల్ గా మారాయి... సిని, రాజకీయ, క్రీడా, అంతరిక్ష పరిశోధనలు ఇలా అనేక రంగాల్లో సంచలనాలు నమోదు అయ్యాయి.

 

+ ఫిబ్రవరిలో పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడి... ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది. భారత సైన్యానికి పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది.

 

+ ఆ తర్వాత ప్రతీకారంతో రగిలిపోయిన భారత్ ఆర్మీ... బాలాకోట్ లో ఉగ్రవాద శిబిరాలను పెద్ద ఎత్తున ద్వంశం చేసింది.

+ 2019 ప్రపంచకప్ లో జరిగిన కొన్ని సంఘటనలు వైరల్ గా మారాయి... మహేంద్ర సింగ్ ధోని కీలక మ్యాచ్ లో రనౌట్ కావడం, ఫైనల్ లో ఇంగ్లాండ్ విజయం పెద్ద ఎత్తున వైరల్ అయింది.

 

+ చంద్రయాన్ 2 ప్రయోగం ప్రపంచం దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే... విక్రం ల్యాండర్ గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో సెర్చ్ చేసారు... దానికి సంబంధించి ఇప్పటికి సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవుతూనే ఉన్నాయి.

 

+ రెండు నెలలుగా పెరుగుతున్న ఉల్లి ధరలకు సంబంధించి కొన్ని వీడియోలు, ఫోటోలు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

+ దిశా అత్యాచార ఘటన ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఆ తర్వాత నిందితులను తెలంగాణా పోలీసులు కాల్చి చంపడం వైరల్ గా మారింది. తెలంగాణా పోలీసులపై ప్రపంచ వ్యాప్తంగా ప్రసంశల వర్షం కురిసింది.

 

+ యాషెస్ సీరీస్ లో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్తోక్స్ ఆడిన ఇన్నింగ్స్ వైరల్ గా మారింది. శ్రీలంక ఆటగాడు కుశాల్ పెరరా ఆడిన ఇన్నింగ్స్ కూడా సోషల్ మీడియా ని ఊపేసింది.

 

+ అంతర్జాతీయ ఉగ్రవాది... అబూ బకర్ అల్ బాగ్దాదీని అమెరికా బలగాలు కాల్చి చంపడం ప్రపంచ వ్యాప్తంగా మారింది.

 

+ వరంగల్ లో జరిగిన 9 నెలల పసికందు మీద జరిగిన అత్యాచార ఘటన ఎక్కువగా వైరల్ అయింది.

 

+ జమ్మూ కాశ్మీర్ కి ఆర్టికల్ 370 రద్దు చేయడం... ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది.

 

+ అదే విధంగా దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం కూడా వైరల్ గా మారింది.

 

+ మహారాష్ట్ర, కర్ణాటక రాజకీయ పరిణామాలు ఈ ఏడాది వైరల్ గా మారాయి.

 

+ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడం కూడా వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: