తాజాగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ఏపికి మూడు రాజధానుల ప్రకటన రాష్ట్రంలో పెద్ద సంచలనంగానే మారింది. ఒకవైపు రాజకీయపార్టీల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. మెజారిటి జనాల్లో జగన్ ప్రతిపాదనకు సానుకూల స్పందన కనిపిస్తోంది. అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ గాను, విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా, కర్నూలును జ్యుడిషియల్ క్యాపిటల్ గాను జగన్ అసెంబ్లీలో ప్రతిపాదించిన విషయం అందరికీ తెలిసిందే.

 

జ్యుడిషియల్ క్యాపిటల్ గా కర్నూలును ప్రతిపాదించారంటే అర్ధముంది. ఎందుకంటే దశాబ్దాలుగా కర్నూలులో హై కోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. పైగా హై కోర్టు ఏర్పాటుకు అవసరమైన మౌళిక సదుపాయాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇపుడున్న జిల్లా కోర్టు ప్రాంగణంలోనే కొన్ని సదుపాయాలు కల్పిస్తే హై కోర్టు ఏర్పాటుకు సరిపోతుందంటున్నారు. అలాగే క్వార్టర్స్ కూడా ఉన్నాయట.

 

సరే అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ గా కంటిన్యు చేయాలనే ఉద్దేశ్యంలో జగన్ ఉన్నారు. కాబట్టి అసెంబ్లీ, కౌన్సిల్ ఇక్కడే ఉంటాయనే అనుకోవచ్చు.  ఇక విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటిల్ ఏర్పాటుకున్న అవకాశాలు ఏమిటి ? ఇదే అందరిలోను వినిపిస్తున్న ప్రశ్న.

 

విశాఖపట్నాన్నే జగన్ ఎందుకు ఎంచుకున్నారంటే ఏపి మొత్తం మీద కాస్మోపాలిటన్ నగరం స్టేటస్ దేనికైనా ఉందంటే అది ఒక్క వైజాగ్ కు మాత్రమే.  అలాగే రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వానికి అత్యధికంగా  ఆదాయాన్ని సమకూరుస్తున్న నగరం కూడా విశాఖనే. ఇక్కడున్న స్టీల్ ప్లాంట్, ఐటి కంపెనీలు, ఫార్మా కంపెనీలు, షిప్ యార్డ్ తదితరాల వల్ల ప్రభుత్వానికి బాగా ఆదాయం వస్తోంది. అలాగే బాగా డెవలప్ అయిన సముద్రతీరం కూడా కలిసివస్తుంది.

 

ఇక విశాఖనగరం భిన్న భాషలకు, సంస్కృతులకు కేంద్రమనే చెప్పాలి. షిప్ యార్డు, స్టీల్ ప్లాంట్, ఐటి, ఫార్మా కంపెనీల కారణంగా దేశంలోని అనేక రాష్ట్రాలకు చెందిన జనాలు ఇక్కడ పెద్ద ఎత్తున నివాసముంటున్నారు.  ప్రభుత్వ భూములు కూడా అపారంగా ఉన్నాయి. పైగా జగన్ ఆధ్యాత్మిక గురువు శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి సలహా కూడా ఉందేమో తెలీదు. ఈ కారణాలను గమనించిన తర్వాతే విశాఖపట్నాన్ని జగన్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రతిపాదించినట్లు అర్ధమవుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: