పవర్ ఫుల్ యాక్షన్ కు హీరోయిజానికి మారుపేరు బాలయ్య.. బాలయ్య తొడగొడితే ఏకంగా ట్రైన్ లు  వెనక్కి వెళ్లిపోతాయి.. ఒక్క చేతితో పెద్ద పెద్ద కార్లను సైతం ఎత్తడం ఓక బాలయ్య సినిమాలోనే చూడగలం. బాలయ్య సినిమా వస్తుందంటే కొంతమంది అభిమానులు మాత్రమే సందడి చేసుకుంటారు. కానీ కొంతమంది అభిమానులు మాత్రం ఇంకెన్ని రోజులు సార్ ఎన్ని రోజులు భరించాలి అనుకుంటూ ఉంటారు. సినిమాల్లో ఎలాంటివి చేయాలన్నా అది ఒక్క బాలయ్యకే సొంతం. డిఫరెంట్ స్టెప్పులు వేయాలన్న... డిఫరెంట్ విగ్గులు పెట్టాలన్న అది ఒక బాలయ్యకే సొంతమైంది. అయితే బాలయ్య అలనాటి పలనాటి బ్రహ్మనాయుడు దగ్గరే ఆగిపోయాడేమో అనిపిస్తూ ఉంటుంది ప్రేక్షకులకు. ఎందుకంటే ఇప్పటికీ బాలయ్య సినిమాలో ఒకప్పటి తరహా ఫైట్లు ఒకప్పుడు తరహా యాక్షన్ సీన్లు కనిపిస్తూ ఉంటాయి. 

 

 

 ఇప్పటికీ తొడగొడితే కుర్చీలు రావడలు... ఒంటిచేత్తో కార్లను ఎత్తెయ్యడాలు లాంటివి బాలయ్య సినిమాలో కనిపిస్తూ ఉంటాయి. ఓవైపు దర్శకులు హీరోలు అందరూ ప్రేక్షకులు సినిమాలు చూస్తే పంథా  మారడంతో సరికొత్త సినిమాలను తెరకెక్కింఛీ వినూత్నంగా  ఆలోచనతో  సినిమాలో  చూపిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించేందుకు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. కానీ నందమూరి బాలకృష్ణ మాత్రం ఇంకా అదే బి సి సెంటర్ల ప్రేక్షకులను నమ్ముకొని సినిమాలు చేస్తున్నాడని టాక్. ఎలా అంటే బాలయ్య ఒక్క పంచ్ ఇస్తే  చాలు పది మంది విలన్ల గాల్లో ఎగిరి పోవడం.. ఒక్క చేతితోనే పెద్ద పెద్ద కార్లను  సైతం అలవోకగా ఎత్తడం  బాలయ్య సినిమాల్లో  ఇప్పటికి దర్శనమిస్తూనే ఉంటాయి. 

 

 

 

 ఇప్పటికీ బాలయ్య సినిమాల్లో కొత్త ధనం  ఎక్కడ  కనిపించలేదు. బాలయ్య సినిమా వస్తుందంటే అలాంటి యాక్షన్ సీన్లు పక్క. అయితే అటు ప్రేక్షకులు కూడా బాలయ్య నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారనుకుంటా . బహుశా ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన కథానాయకుడు మహానాయకుడు సినిమాల్లో ఇలాంటి యాక్షన్ సన్నివేశాలు లేవు అనే సినిమాను ప్రేక్షకులు అంతగా ఆదరించలేకపోయారు. ప్రస్తుతం రాబోతున్న రూలర్ సినిమా కూడా బాలయ్య అన్ని సినిమాల్లో లాగానే ఉండబోతుంది అని టాక్ వినిపిస్తోంది. బాలయ్య ట్రెండ్ ఫాలో అవకుండా.. ఒకప్పటి ట్రెండ్ ని ఇప్పుడు రిపీట్ చేస్తున్నాడు అని ప్రేక్షకులు భావిస్తున్నారు. ట్రెండ్ కి  తగ్గట్టు మారకుండా సరి కొత్త సినిమాలు చేయకుండా ఇంకా అవే యాక్షన్  చేస్తున్నారు అని అనుకుంటున్నారు ప్రేక్షకులు . బాలయ్య బి సి సినిమాలు ఏమో కానీ ఇంకా బీసీ కాలంలోనే ఉండిపోయారు అంటూ తెలుగు ప్రేక్షకులు భావిస్తున్నారు. చూడాలి మరి రేపు  విడుదల కాబోతున్న రూలర్ సినిమాలో అయినా  బాలయ్యలో  ఏమైనా మార్పులు కనిపిస్తుందో ఏమో.

మరింత సమాచారం తెలుసుకోండి: