ఢిల్లీలో అతి దారుణంగా 23 ఏళ్ల నిర్భయ అనే యువతిని ఆరుగురు నిందితులు అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. మూకుమ్మడిగా అత్యాచారం చేసిన అనంతరం  మర్మాంగాల లోకి పదునైన వస్తువులు జొప్పించడం తో తీవ్ర గాయాలపాలైన నిర్భయ చికిత్స పొందుతూ మృతి చెందింది ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘట్టనాలోని  అత్యాచార నిందితులకు శిక్షలు పడేలా కేంద్రం నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే నిర్భయ కేసులో ని మైనర్ కు మూడేళ్ల జైలు శిక్ష విధించగా నిందితుల్లో ఒకరు  జైల్లోనే ఉరి వేసుకొని చనిపోయాడు. ప్రస్తుతం ఉన్న నలుగురు నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.

 

 

 కాగా ఉరిశిక్ష వేసి నిందితుల్లో ఒకరు క్షమాభిక్ష కోసం రివ్యూ  పిటిషన్ దాఖలు చేశారు.  నిర్భయ కేసులో ని నలుగురు నిందితులు సుప్రీం కోర్టు ఉరి శిక్ష విధించగా. నిందితుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ తనకు ఉరిశిక్ష రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు అతని  రివ్యూ పిటిషన్ బుధవారం తోసిపుచ్చింది.

 

 

 

 నలుగురు నిందితులకు మరణశిక్ష విధిస్తూ 2017 లో చెప్పిన తీర్పు మార్చాల్సిన అవసరం లేదంటూ జస్టిస్  భానుమతి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా  క్షమాభిక్ష పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంపై  కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్వాగతించారు. అత్యున్నత ధర్మాసనం తీసుకున్న నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. నిర్భయ దోషులకు ఉరి శిక్ష తప్పదని ఆయన అన్నారు. దేశంలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న రాక్షసులకు  అందరికీ సుప్రీంకోర్టు నిర్ణయం గుణపాఠంగా ఉండాలన్నారు కర్ణాటక సీఎం ఎడ్యూరప్ప. కాగా నిర్భయ దోషులకు రివ్యూ పిటిషన్ సుప్రీం కోర్టు తోసిపుచ్చడంపై   కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి సిద్దిరామయ్యలు  కూడా హర్షం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: