ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్క చోటు రోడ్డు  ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. రోడ్డు  ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం కూడా చాల జాగ్రతలు తీసుకుంటాయి. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం హెల్మెట్ ధరించమని తెలుపుతుంది. తాజాగా విశాఖపట్నం జిల్లాలో చోడవరం పెట్రోల్‌ బంకు వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదానికి గురి చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే మాడుగుల మండలం ఎం.కోడూరుకు చెందిన కోనేటి జగదీష్‌ తన భార్య నూకరత్నం(30), నాలుగేళ్ల కుమార్తెతో కలిసి బైక్ పై లంకెలపాలెంలో తన బంధువుల ఇంట్లో జరిగిన పెద్దకర్మ కార్యక్రమానికి వెళ్లడం జరిగింది. కార్యక్రమం తర్వాత తిరిగి స్వగ్రామానికి ముగ్గురూ స్కూటర్‌పై రావడం జరిగింది.

 

ఇక  బీఎన్‌ రోడ్డుపై చోడవరం ఊర్లోని పెట్రోల్‌ బంకు వద్దకు చేరుకునే సరికి వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు బైక్ ని   ఢీ కొట్టడం జరిగింది. ఇలా అవ్వడంతో స్కూటర్‌పై వెనుక కూర్చున్న నూకరత్నం రోడ్డుపై కింద పడింది. స్కూటర్‌ నడుపుతున్న జగదీష్‌ తన ముందు కూర్చున్న కుమార్తెను పట్టుకొని రోడ్డు పక్కన ఎడమ వైపునకు పడి పడిపోవడం జరిగింది.

 

 

ఇంతలోనే రోడ్డుపై పడిపోయిన నూకతర్నం తలపై నుంచి బస్సు వెనుక చక్రం పోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇక జగదీష్, కుమార్తెకు తీవ్ర గాయాల పాలు అయ్యారు. జగదీష్‌  కళ్లెదుటే భార్య చనిపోవడంతో కన్నీరు మున్నీరు అయ్యాడు. ఇక నూకరత్నం  రక్తపుమడుగులో పడి ఉన్న మృతదేహాన్ని చూసి రోదించిన తీరు అక్కడి వారిని శోకసముద్రంలో మునిగారు అందరు.

 

హుటా హుటిగా చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు స్థానికులు ప్రయత్నం చేసిన కూడా  రోడ్డుపై విగతజీవిగా పడి ఉన్న భార్య మృతదేహం వద్దే కుప్పకూలిపోయాడు జగదీష్‌ . ఇక ఈ విషయం అందుకున్న  పోలీసులు వచ్చి నూకరత్నం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చోడవరం ఆస్పత్రికి తరలించడం జరిగింది. గాయపడిన జగదీష్, అతని కుమార్తెకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇక బస్సు డ్రైవర్‌ ప్రమాదం జరిగిన వెంటనే చోడవరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి సమాచారం ఇవ్వడం జరిగింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: