నగరంలో రోజు రోజుకు అసాంఘిక కార్యకలాపాలు పెరిగి పోతున్నాయి. ఇప్పుడు నగరం దోపీడీలకు, వ్యభిచారులకు, ఉగ్రవాదులకు అడ్డాగా మారుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలో చట్టం ఇప్పటికే చాలావరకు వ్యభిచార గృహాలు నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే.. ఎంతగా చర్యలు చేపట్టినా కొందరు చేయవలసిన తప్పుడు పనులను చేస్తూనే ఉన్నారు. ఇలాంటి వారు సమాజానికి చీడలా మారారు. ఇప్పుడు వ్యభిచారాలకు అడ్డాగా నగరంలో చాలా చోట్లు ఉన్నాయి. తేరగా డబ్బు సంపాధించాలనే అత్యాశతో చాలమంది యువతులు ఈ రొంపిలోకి దిగుతున్నారు.

 

 

ఇకపోతే హైదరాబాద్ లోని లిస్బిన్ పబ్ పై పోలీసులు జరిపిని అకస్మిక దాడుల్లో ఎన్నో కార్యకలాపాలు బయటపడ్డాయి.. ఎలాంటి ఫీజు వసూలు చేయకుండానే నిర్వాహకులు యువతులను పబ్బుల్లోకి అనుమతించడమే కాకుండా, పబ్బు సమయవేళలు ముగిసిన తర్వాత కూడా పబ్ లో గానా బజానాలు నిర్వహిస్తున్నారు. ఆకస్మికంగా జరిపిన దాడులలో 21 మంది యువతులు తొమ్మిది మంది యువకులు లోపల చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండగా అరెస్ట్ చేసారు, ఈ సందర్భంగా పబ్ నిర్వాహకులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసిన వారందరిని పోలీస్ స్టేషన్ తరలించారు..

 

 

ఇప్పటికే నగర పోలీసులకు దొంగలతో, అత్యాచారాలు చేసే మృగాలతో తలనొప్పి అవుతుంటే అందులో ఈ వ్యభిచారాలు, పబ్బుల్లో జరిపే అసాంఘిక కార్యకలాపాలతో ఇంకా సతమతం అవుతున్నారు.. ఇకపోతే రాజధాని నగరంలో చీకట్లు కమ్ముకుంటే చాలు... అసాంఘిక కార్యకలాపాలు మొదలవుతున్నాయి. ఇప్పటికే హైదరాబాదులోని హోటళ్లు, లాడ్జిలపై నిఘా పెరుగుతుండటంతో కొందరు ఫాంహౌస్‌ల వైపు దృష్టి సారిస్తున్నారు. ఇదే కాకుండా జిల్లా కేంద్రానికి సమీపంలోని శివారు గ్రామాలు, కాలనీలు నేరస్తులకు అడ్డాగా మారుతున్నాయి. నగరం చుటూపక్కల ఉన్న గ్రామాల్లో చట్టవ్యతిరేక కార్యక్రమాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణలో భాగంగా ఇతర పట్టణాలనుంచి, వివిధ పనుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో నేరాల సంఖ్య కూడా ఇదే రీతిలో పెరుగుతున్నాయి...

మరింత సమాచారం తెలుసుకోండి: