చంద్రబాబు అనంతపురం పర్యటనలో భాగంగా పార్టీ కార్యకర్తలు నేతలతో ఏర్పాటుచేసిన సమావేశంలో చంద్రబాబుతో పాటు  మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జెసి దివాకర్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాగా ప్రస్తుతం జేసీ చేసిన వ్యాఖ్యలకు పోలీసులు గట్టిగ కౌంటర్ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే బూట్లు  నాకే పోలీసులను తెచ్చుకుంటామంటూ మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా పోలీస్ అధికారులు  గట్టిగా కౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రి జేసీ దివాకర్రెడ్డి చేసిన వ్యాఖ్యలు దారుణమని వెంటనే ఆయన పోలీసులకు బేషరతుగా క్షమాపణలు చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ... బూట్లు ఎవరు నాకరన్న  విషయం జిల్లా ప్రజలకే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని... జెసి దివాకర్ రెడ్డి తన హోదాని వయసును మరచి మతి భ్రమణం లో మాట్లాడుతున్నారు అంటూ  పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

 

 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పని చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు అదే వేదికపై ఉండి కూడా... మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు కనీసం ఖండంచకుండా ముసిముసినవ్వులు కురిపించడం శోచనీయమని ఆరోపించారు. జెసి దివాకర్ రెడ్డి హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. గతంలో కూడా పోలీసులను కొజ్జాల అంటూ వ్యాఖ్యానించి నోరు పారేసుకున్న జెసి దివాకర్ రెడ్డి ఇప్పటికీ పర్యవసానం అనుభవిస్తున్నారని.. ఇప్పుడు అంతకంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటాడు అంటూ విమర్శించారు. పోలీసుల పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి కనీసం నీ గన్ మెన్ లను  వదిలిపెట్టి ఉండగలవా... అంటూ ప్రశ్నించారు. 

 

 

 

 అనంతపురం జిల్లా పోలీసు వ్యవస్థ ఎంతో సమర్ధవంతంగా నీతి  నిజాయితీతో పని చేస్తుందని... జిల్లా పోలీసుల నిజాయితీని శంకించాల్సిన అవసరం లేదని వారు తెలిపారు. పరుష పదజాలాన్ని వాడుతూ పోలీసులపై ఘాటు వ్యాఖ్యలు చేసిన జెసి దివాకర్ రెడ్డి పై క్రిమినల్ కేసులు పెట్టేలా  ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు. మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి భవిష్యత్తులో ఉంటారో లేదో తెలియదు కానీ పోలీసు వ్యవస్థ మాత్రం ఎప్పటికీ ఉంటుందని వారు హితవు పలికారు. ఇక మాజీ మంత్రి జేసీ దివాకర్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: