కర్ణుడికి కవచ కుండాలు ఎలా ఉంటాయో..  యూటర్న్‌ అనేది సహజ గుణం అని, ఆంగ్ల మాధ్యమంపై కూడా యూటర్న్‌ తీసుకొని మాట్లాడార ని  రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. శాసనసభలో ఇంగ్లిష్, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ విభజన బిల్లులకు తండ్రి ఎస్‌ అంటే మండలిలో కొడుకు లోకేష్‌ నో అంటున్నాడని  రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు.

 

 

తండ్రీకొడుకులకు సరిపోవడం లేదా..? లేక దొంగనాటకాలు ఆడుతున్నారా అని  రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చట్టాన్ని, ఇంగ్లిష్‌ మాధ్యమం బోధన చట్టాన్ని బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెడతామని, స్కూళ్లు తెరిచేలోపు చట్టాన్ని ఆమోదింపజేస్తామని వివరించారు.  ఆడవారి రక్షణ కోసం, ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చట్టసభలో అనేక బిల్లులు ప్రవేశపెట్టారు.

 

 

 మహిళలపై అత్యాచారం, వేధింపుల కేసుల్లో 21 రోజుల్లో నిందితులు శిక్షించబడేలా దిశ చట్టాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వాన్ని, సీఎం వైయస్‌ జగన్‌కు దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ప్రజల మంచి కోసం ప్రభుత్వం చట్టాలు చేస్తుంటే చంద్రబాబు మాత్రం అసెంబ్లీని స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు.

 

 

పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే... " పరిపాలన సౌలభ్యం కొరకు ఇంకా ప్రజలకు మేలు చేసేందుకు మొత్తం 22 బిల్లులు ప్రవేశపెడితే.. ప్రతిపక్షం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ విభజన బిల్లును, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన బిల్లుకు శాసనమండలిలో మోకాలొడ్డింది. ఈ రెండు అంశాల్లో తెలుగుదేశం పార్టీ అసలు స్వరూపాన్ని ప్రజలు గ్రహించారు. ముందు ప్రభుత్వ పాఠశాలలో తెలుగు తప్పితే ఆంగ్ల మాధ్యమం బోధించేందుకు వీలు లేదని మొదలుపెట్టి.. తెలుగు భాషను సీఎం వైయస్‌ జగన్‌ చంపేస్తున్నట్లు.. చంద్రబాబు కాపాడుతున్నట్లుగా రకరకాలుగా మీటింగులు పెట్టారు. 

 

 

రోజులు గడిచే కొద్ది ప్రజలు తిడుతున్నారని తెలుసుకొని తెలుగు, ఇంగ్లిష్‌ రెండూ ఉండాలని సన్నాయి నొక్కులు నొక్కారు. కర్ణుడికి కవచ కుండాలు ఎలా ఉంటాయో.. చంద్రబాబుకు యూటర్న్‌ అనేది సహజ గుణం. ఇంగ్లిష్‌ బోధన విషయంలో కూడా యూటర్న్‌ తీసుకొని మాట్లాడారు. తీరా కౌన్సిల్‌లో లోకేష్‌ నాయకత్వంలో అడ్డుకోవడం వారి సహజ గుణాన్ని చూపించుకోవడం కాదా..? అని ప్రశ్నిస్తున్నాను. తండ్రి శాసనసభలో ఎస్‌ అనడం.. కొడుకు కౌన్సిల్‌లో నో చెప్పడం.. ఇంతకంటే దిగజారి రాజకీయాలు చేయడం ఈ ప్రపంచంలో ఎవరి వల్ల అవుతుంది. పేదవారు ఎప్పటికీ వారి కుటుంబాలు బాగా చదువుకొని పైకి రాకూడదనే చంద్రబాబు, లోకేష్‌ ఆలోచన తప్పితే ఇందులో మరో అర్థం ఏమీ లేదు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ విభజన బిల్లుకు కూడా సభలో ఆమోదించడం.. మండలిలో అభ్యంతరం చెప్పడం. తండ్రీ కొడుకులకు పడడం లేదా..? తండ్రి అంటే మర్యాద లేదా.. ఇద్దరూ కలిసి దొంగనాటకాలు ఆడుతున్నారా..? అని నిలదీశారు మంత్రి పేర్ని నాని.

 

మరింత సమాచారం తెలుసుకోండి: