ఆర్‌బీఐ.. ఈ మధ్యాకాలంలో వినియోగదారులకు గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్ లు చెప్తుంది. ప్రజలకు లాభం వచ్చేలా ఆర్‌బీఐ నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఆర్‌బీఐ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ సంచలన నిర్ణయం ఏంటి అంటే..  ప్రస్తుతం నెఫ్ట్‌ 24 గంట‌లు అందుబాటులో ఉంటుంది.. ఈ నేపథ్యంలోనే బ్యాంకు నెఫ్ట్, ఆర్టీజీఎస్ లావాదేవీల ఛార్జీలను ఎత్తేసింది. 

                                               

సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ నుంచి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్-నెఫ్ట్ ఛార్జీలు వసూలు చేయొద్దని ఆర్‌బీఐ అన్ని బ్యాంకుల‌ను ఆదేశించింది. ఇప్పటియికే కొన్ని బ్యాంకులు ఉచితంగా అందిస్తుండ‌గా, మ‌రికొన్ని బ్యాంకులు ఈ సేవ‌ల‌ను జ‌న‌వ‌రి నుంచి ఇవ్వ‌నున్నాయి. డిజిట‌ల్ చెల్లింపుల‌ను ప్రోత్స‌హించేందుకు సేవింగ్ అకౌంట్స్ పై ఛార్జీల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. 

                                               

జ‌న‌వ‌రి 1, 2020 నుంచి ఈ కొత్త నిబంధ‌న‌లు అమ‌ల్లోకి రానున్నాయి. జులై నుంచి నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ లావాదేవీల‌పై ఛార్జీల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఆర్‌బీఐ ప్ర‌క‌టించింది. బ్యాంకులు కూడా ఈ ప్ర‌యోజ‌నాన్ని వినియోగ‌దారుల‌కు బ‌దిలీ చేయాల‌ని సూచించింది. దాంతో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ నెఫ్ట్‌ లావాదేవీల‌ను ఉచితం చేశాయి. దేశీయ అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ… ఐఎంపీఎస్‌, ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌, యోనో, ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్‌ల‌పై నెఫ్ట్ లావాదేవీల ఛార్జీల‌ను ర‌ద్దు చేసింది. అదేవిధంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా నెఫ్ట్ లావాదేవీల‌ను ఉచితం చేసింది

 

మరింత సమాచారం తెలుసుకోండి: