తాజాగా అసెంబ్లీ సమావేశాలలో సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన విషయం అందరికి తెలిసిందే కదా. ఇందుకు సంబంధించి ఆంధ్రాలో మూడు రాజధానుల ప్రకటనను వెనక్కి తీసుకోవాలని  అమరావతి రైతులు డిమాండ్ చేయడంతో పాటు బంద్ కు  పిలుపు నివ్వడం జరిగింది. ఇలా బంద్ కు  పిలుపు నివ్వడంతో ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో ఉద్రిక్తత మొదలు అవ్వడం జరిగింది. ఇక మరో వైపు రైతుల బంద్ పిలుపు మేరకు స్వచ్ఛందంగా వ్యాపార, విద్యాసంస్థలను మూసి వేయడం జరిగింది. గుంటూరు జిల్లా  వెలగపూడిలో రిలే దీక్షలు నిర్వహించడం జరిగింది. ఇక మరో వైపు నేటి నుంచి రోడ్ల దిగ్బంధం, వంటా వార్పు కార్యక్రమాలు నిర్వహించాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది.

 


 నిజానికి రైతులు అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరడం జరుగుతుంది. ఇదిలా ఉండగా రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్‌ అమలు అవుతున్నట్లు పోలీసు అధికారులు ప్రకటించడం జరిగింది. ఈ మేరకు ఆదేశాలను జారీ చేస్తున్నట్లు తుళ్లూరు డిఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలియచేయడం జరిగింది. ఈ నిర్ణయం తీసుకోవడనికి ముఖ్య కారణం  రాజధాని పరిధిలోని 29 గ్రామాలలో రాజధాని అంశంపై జరుగుతున్న ఆందోళనలు అనే సమాచారం ఉంది. ముఖ్యంగా  పోలీసులు సచివాలయం వెళ్లే మార్గాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక తుళ్లూరు, మందడం, మంగళగిరిలో చెక్‌పోస్టులు కూడా  ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా  ఆర్టీసీ బస్సులను క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు.

 

ఇక ఎవరైనా   అనుమానితుల గుర్తింపు కార్డులను కూడా పరిశీలన చేయడం జరుగుతుంది అని అధికారులు తెలియచేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు  ఆందోళన కార్యక్రమాలను శాంతియుతంగా నిర్వహించాలని తెలియచేయడం జరిగింది. ఎవరైనా  చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు.  ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలపై రాజధాని అమరావతితోపాటు గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు తగ్గిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: