ఒక 6 నెలల గర్భవతి పోలీసు స్టేషన్ కు వెళ్లి తన కడుపులోని బిడ్డకు ఇద్దరు తండ్రులు అని, ఆ ఇద్దరు తనని మోసగించి లైంగికంగా వాడుకున్నారు అని ఫిర్యాదు చేసింది. ఇటువంటి అరుదైన ఫిర్యాదుని విన్న పోలీసులు షాక్ అయ్యారు.

వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని ఒక గ్రామంలో ఒక మహిళ ఇంటర్ వరకు చదువుకొని... ఇంటి దగ్గరే ఉండేది. అయితే కొన్ని నెలల నుంచి తన తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ కూలి పనులకు వెళ్లడం ప్రారంభించింది. వీళ్ళు కూలి పనులకు వెళ్లేందుకు రామారావు అనే ఒక వ్యక్తి వాహనంలో ప్రయాణించేవారు. రామారావు కూడా బాధితురాలి గ్రామ నివాసే.

ప్రతిరోజు రామారావు వాహనంలో యువతి ప్రయాణించడంతో... అతడు ఆమెపై కన్నేసి.. ఆ తర్వాత క్రమక్రమంగా పరిచయం పెంచుకున్నాడు. తర్వాత ప్రేమించానని, పెళ్లి చేసుకుంటాను అంటూ ఆ అమాయకత్వపు యువతిని తన వలలో వేసుకున్నాడు. రామారావు మాటలు గుడ్డిగా నమ్మిన ఆ మహిళ అతడు ఎక్కడి పిలిచినా వెళ్ళేది. ఈ విధంగా రామారావు ఆ యువతిని పార్కులకు, సినిమాలకు, లాడ్జి లకు తీసుకువెళ్లి తన కామ వాంఛను తీర్చుకున్నాడు.


ఆ యువతి కదలికలపై కన్నేసి... వీరిద్దరి మధ్య సాగుతున్న లైంగిక సంబంధం గురించి అదే గ్రామానికి చెందిన పైడిరాజు అనే మరొక వ్యక్తి తెలుసుకున్నాడు. ఒకరోజు ఆమెను అడ్డగించి... 'నువ్వేం చేస్తున్నావో నాకు అంతా తెలుసు. నేను చెప్పినట్టు నువ్వు వింటే.. నేను ఎవ్వరికీ చెప్పను. లేదంటే మీ అమ్మ నాన్నలకు నీ విషయం తెలియజేస్తాను', అని బెదిరించాడు. దాంతో పాపం భయపడిపోయిన ఈ యువతి అతను చెప్పినట్లు గా విన్నది. అదే అదునుగా భావించిన పైడిరాజు కూడా అనేకమార్లు యువతిని లైంగికంగా వాడుకున్నాడు. వీళ్లిద్దరి మధ్య శారీరకంగా నలిగిపోయిన యువతి కొన్ని నెలల తరువాత గర్భం దాల్చింది.


దీంతో యువతి శరీరంలో మార్పులను కుటుంబ సభ్యులు గమనించారు. ఏమైంది అని నిలదీశారు. దాంతో ఆమెకు జరిగిన విషయం అంతా చెప్పి కంటతడి పెట్టుకుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను ఒక ఆసుప్రతికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెకు పరీక్షలు చేసి ఆరు నెలల గర్భం ధరించిందని తేల్చారు. దాంతో షాకయిన కుటుంబ సభ్యులు బుధవారం రోజు ఆమె చేత చీపురుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. ఆమె తన ఫిర్యాదులో.. రామారావు, పైడిరాజు అనే ఇద్దరు వ్యక్తులు తనను లైంగికంగా వాడుకున్నారని, తన కడుపులోని బిడ్డకు వారిద్దరే కారణమని పేర్కొంది.

ఆమె ఫిర్యాదు మేరకు పైడిరాజు, రామారావుపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఇక్కడ వచ్చిన చిక్కు సమస్య ఏంటంటే... ఆమె కడుపులోని బిడ్డ కి అసలు తండ్రి అనేది తెలీకపోవడం. దాంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. ప్రస్తుతం ఆ బిడ్డకు తండ్రెవరో తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: