తమ్ముళ్ళల్లో రోజు రోజుకు టెన్షన్ పెరిగిపోతోంది. ఏపికి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన చేసిన తర్వాత నుండి ప్రధానంగా తెలుగుదేశంపార్టీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. జగన్ ప్రతిపాదనను టిడిపిలోని ఇద్దరు ముగ్గురు నేతలు మాత్రం సానుకూలంగా స్పందించారు. విశాఖపట్నంను ఎగ్జిక్యుటివ్ క్యాపిటల్ చేయాలన్న ప్రతిపాదనకు టిడిపి ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు స్వాగతించారు.

 

అలాగే కర్నూలును జ్యుడీషియల్ క్యాపిటల్ గా ఏర్పాటు చేయాలన్న  జగన్ ప్రతిపాదనకు జిల్లాలోని టిడిపి సీనియర్ నేతలు కేఇ కృష్ణమూర్తి, కేఇ ప్రభాకర్ మద్దతు  పలికారు. టిడిపికి ఉత్తరాంధ్రలో బలమైన నేతలే ఉన్నారు. కాకపోతే వాళ్ళలో చాలామంది మొన్నటి ఎన్నికల్లో  ఓడిపోయారు. అధికారంలో ఉన్నంత కాలం తమ ప్రాంతాన్ని ఏమాత్రం పట్టించుకోని చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, అశోక్ గజపతిరాజు, సుజయ కృష్ణ రంగారావు లాంటి నేతలు చాలామంది  పవర్ ను మాత్రం బాగా ఎంజాయ్ చేశారు.

 

అలాంటిది ఇపుడు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా  చేయచ్చన్న జగన్ ప్రతిపాదనకు జనాల నుండి బ్రహ్మాండమైన మద్దతు లభిస్తోంది. అదే సమయంలో టిడిపి నేతలు మాత్రం నోరిప్పలేకపోతున్నారు. అంటే తమ ప్రాంతం అభివృద్ధి జరగటం వాళ్ళకు ఇష్టం లేదా ? లేకపోతే చంద్రబాబునాయుడు భయపడి నోరెత్తలేకపోతున్నారా ? విషయం ఏమైనా కానీండి జగన్ ప్రతిపాదనపై నోరిప్పాల్సిందే అంటూ ఆయా నియోజకవర్గాల్లోని తమ్ముళ్ళపై జనాలు బాగా ఒత్తిడి పెంచేస్తున్నారట.

 

జనాల ఒత్తిడి వల్ల తమ్ముళ్ళు పెద్ద ఇరకాటంలో పడ్డారు.  జగన్ ప్రతిపాదనపై మాట్లాడటమంటూ జరిగితే మద్దతుగానే మాట్లాడాలి. వ్యతిరేకంగా మాట్లాడితే జనాలు బతకనీయరు. అదే సమయంలో తాము మద్దతుగా మాట్లాడితే అధినేత చంద్రబాబును వ్యతిరేకించినట్లు అవుతుంది. దాంతో ఏం చేయాలో అర్ధంకాక టిడిపి నేతలంతా తలలు పట్టుకుంటున్నారు. ఇక్కడ గుడ్డిలో మెల్లేమిటంటే కర్నూలూ జిల్లా నేతలకు ఈ తలనొప్పులు లేకపోవటమే.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: