చలికాలం ఒక రకంగా జబ్బుల సీజన్. ఎందుకంటే..రకరకాల ఇన్‌ఫెక్షన్లు మనల్ని పీడించడానికి సిద్ధంగా ఉంటాయి. జలుబు, రొంపా, జ్వరం లాంటివి పీడిస్తాయి. అయితే వీటి నుంచి కాపాడుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం..

 

 

బెల్లం, నారింజ, మిరియాలు, నిమ్మ గుడ్డు.. ఈ ఐదు వాడి జబ్బుల నుంచి కాపాడు కోవచ్చు. బెల్లంలో ఉండే క్యాల్షియం, ఐరన్‌, సల్ఫర్‌, పొటాషియం, మెగ్నిషయం వంటి మూలకాలు... అనారోగ్యాలను నిరోధిస్తాయి. గొంతు, ఉదర సంబంధ అనారోగ్యాలు, రక్తహీనత రాకుండా కాపాడుతుంది. ఇక నారింజ నుంచి విటమిన్‌-సి లభిస్తుంది. ఈ పండు రసం తాగడం వల్ల శరీరానికి గ్లూకోజ్‌, విటమిన్‌-ఎ, బి1, పొటాషియం, ఫోలిక్‌ ఆమ్లం, క్యాల్షియం, తగినంత పీచు అందుతాయి. 

 

 

దీనిలోని గ్లూకోజ్‌ తక్షణ శక్తిని అందిస్తుంది. బరువు నియంత్రణలో ఉంచుకోవాలనుకునేవారు దీన్ని ఆహారంలో తీసుకోవాలి. ఇక జలుబో, గొంతునొప్పో వచ్చినప్పుడు మిరియాల పాలు తాగుతాం. వీటిని చలికాలమంతా ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల మీరు అనారోగ్యాల బారిన పడరు. వీటిలో యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీ ఆక్సిడెంట్‌లతోపాటు మెగ్నిషియం, ఐరన్‌, కాపర్‌, పీచు, విటమిన్లు మెండుగా ఉంటాయి. పుల్లటి నిమ్మకాయను ఈ కాలంలో కొందరు  ఇష్టపడరు. 

 

 

కానీ ఈ పండులో విటమిన్‌-సి సమృద్ధిగా ఉంటుంది. ఇది మీ గొంతు ఆరోగ్యాన్ని రక్షించడంతోపాటు చాలా రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. గ్లాసు గోరువెచ్చటి నీటిలో చెంచా నిమ్మకాయ రసం, చెంచా తేనె కలిపి ప్రతిరోజూ ఉదయం తాగితే బరువు నియంత్రణలో ఉంటుంది. ఇక గుడ్డు ఎముకలు, కండరాలకు చాలా బలవర్థకమైన పదార్థం. కాలం మారుతున్న సమయంలో విజృంభించే వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. ఈ ఐదు వాడండి. జబ్బుల నుంచి దూరంగా ఉండండి. మరి ఈ జాగ్రత్తలు తీసు కుంటారు కదూ.. హ్యాపీ వింటర్..

మరింత సమాచారం తెలుసుకోండి: