ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. దాంతో ఆంధ్రప్రదేశ్ లోని రాజధాని ప్రాంత రైతులు ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు.


అయితే జగన్మోహన్ రెడ్డి.. ఏపీకి 3 రాజధానులని తీసుకున్న నిర్ణయం.. తెలంగాణ రాష్ట్రం పై కూడా ప్రభావం చూపుతుంది. తెలంగాణకు చెందిన ఆదిలాబాద్ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు సోయం బాపురావు జగన్ నిర్ణయానికి మద్దతు పలికాడు. అదే విధంగా ఒక వార్తా చానల్ తో మాట్లాడుతూ... తెలంగాణ రాజధాని హైదరాబాద్.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కి చాలా దూరం(మూడు వందల కిలోమీటర్ల దూరం) ఉందని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా బాగా వెనుకబడిన జిల్లా అని, ఆదిలాబాద్ ను ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేసారు. ఏడాదికి రెండుసార్లు తప్పనిసరిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించాలని డిమాండ్ చేశారు.



అలాగే తెలంగాణాకి కూడా 3 రాజధానులని ఏర్పాటు చేసి అధికారాన్ని కేంద్రీకరించాలని, మరిన్ని నగరాలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేసారు. ఆ తర్వాత ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలియజేసినట్లు చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలన్న విషయంపై తెలంగాణ గవర్నర్ రాష్ట్ర తమిళిసై సౌందరరాజన్‌ను ఈరోజు కలుస్తానన్నాడు సోయం బాపురావు. తాను చేసే డిమాండ్‌లో న్యాయం ఉందని బాపురావు విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎక్కువ రాజధానులని ఏర్పాటు చేసే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణలో ఎందుకు తీసుకోకూడదని బాపురావు ప్రశ్నించారు. చాలా సంవత్సరాలుగా ఆదిలాబాద్ జిల్లా కొంచెం కూడా అభివృద్ధి చెందలేదని ఆయన తెలిపారు.

గతంలో ఆంధ్రప్రదేశ్.. ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించగానే... ఆ ప్రభావం తెలంగాణ ఆర్టీసీ కార్మికులపై పడి... వారు కూడా తమని ప్రభుత్వం లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అదే తరహాలో ఏపీలో 3 రాజధానుల నిర్ణయం ప్రకటించగానే... తెలంగాణలో కూడా మూడు రాజధానులని ఏర్పాటు చేయాలనే డిమాండ్స్ వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: