ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జనసేన మద్దతుతో  టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్ష హోదాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అసెంబ్లీలో వైసీపీ సభ్యుల ఈ విషయంలో వ్యవహరించిన తీరు తెలియనిది కాదు. ప్రతిపక్ష హోదా ఉన్న కూడా కనీసం అసెంబ్లీలో మాట్లాడేందుకు కూడా వైసీపీ ఎమ్మెల్యే లకు అవకాశం ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. ఆనాడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాలో తండ్రి బాటలోనే వైఎస్ జగన్మోహన్రెడ్డి నడిచారు. అధికార టిడిపి ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ ఏనాడు కూడా వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో బాధను వెలిబుచ్చారు. 

 


ఇక ఆ తర్వాత  2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో సొంతం చేసుకుని వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసెంబ్లీలో... ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక్క మాట కూడా గట్టిగా మాట్లాడలేకపోతున్నారు . వైసిపి కి సంబంధించి 150 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండడంతో చంద్రబాబు ఏ ఒక్క విమర్శ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ చంద్రబాబు పై విరుచుకుపడుతు  కామెంట్లు చేస్తున్నారు. దీంతో మాట్లాడడానికి భయపడో..  మాట్లాడానికి ఏమి లేకనో తెలీదు కానీ  అసలు అసెంబ్లీలో గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు  చంద్రబాబు నాయుడు. 

 


 కానీ ఒకప్పుడు వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా అని దక్కించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అసెంబ్లీలో అధికార పార్టీని సైతం గడగడలాడించాడు. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ డి అంటే డి అనే విధంగా ప్రశ్నలు సంధిస్తూ.. అసెంబ్లీలో ఎన్నోసార్లు అధికార పార్టీని ఇరకాటంలో పడేశారు చంద్రబాబు నాయుడు. కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబు తీరులో మార్పు వచ్చింది... ఒకప్పుడు అసెంబ్లీలో ఎక్కువ  మాట్లాడి .  ప్రెస్ మీట్ లో అతి  తక్కువ  మాట్లాడిన చంద్రబాబు నాయుడు. ఇప్పుడు  ప్రెస్ మీట్లో ఎక్కువ మాట్లాడి  అసెంబ్లీలో మాట్లాడడం చాల  తగ్గించారు. 

 


 అసెంబ్లీలో గట్టిగా మాట్లాడలేక అసెంబ్లీ సమావేశం అనంతరం వచ్చి ప్రెస్ మీట్ లో  తన బాధను వెళ్లగక్కుతున్నారు చంద్రబాబు. అసెంబ్లీలో అడగాల్సిన ప్రశ్నలు అన్ని అసెంబ్లీ సమావేశం అనంతరం ప్రెస్ మీట్ లో  అడుగుతున్నారు. అసలు చంద్రబాబు కి ఏమైంది... ఒకప్పటి చంద్రబాబేనా ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడలేక ప్రెస్ మీట్ లో తన బాధను వెళ్లగక్కుతున్న బాబోరు. అసెంబ్లీలో అడగలేక ప్రెస్ మీట్ లో ఎందుకు బాధను వెళ్లగక్కుతున్నారు అన్నది అందరిలో  నెలకొన్న ప్రశ్న.

మరింత సమాచారం తెలుసుకోండి: