ముఖ్య‌మైన స్థానాల్లో ఉన్న‌వారు, బాధ్య‌త‌గ‌ల ప‌ద‌వుల‌ను చేప‌ట్టిన వారు త‌మ చ‌ర్య‌లు, త‌మ కుటుంబ స‌భ్యుల చ‌ర్య‌ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేదంటే... వాళ్లు ఇబ్బంది ప‌డ‌తారు. వాళ్ల కుటుంబ‌స‌భ్యుల‌ను సైతం ఇబ్బంది పెడ‌తారు. అలా ఇబ్బంది ప‌డిన వారి జాబితాలో బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ చేరారు. త‌న‌కు సంబంధం లేని విష‌యంలో... కూతురు స్పందించిన తీరు వివాదాస్ప‌దం కావ‌డంతో....ఆ న‌ష్టాన్ని క‌ప్పిపుచ్చేందుకు సౌర‌వ్ గంగూలీ రంగంలోకి దిగాడు. ద‌యచేసి...త‌న బిడ్డ‌ను వ‌దిలేయండి అంటూ కోరుకున్నాడు సౌర‌వ్ గంగూలీ. 

 

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా బెంగాల్‌లో భారీ ఎత్తున్న ఆందోళ‌న‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో  బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ స‌నా గంగూలీ వివాదంలో ఇరుక్కున్నారు. సౌర‌వ్ గంగూలీ కుమార్తె స‌నా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టంపై చేసిన పోస్టు క‌ల‌కలం రేపింది. ప్ర‌ముఖ ర‌చ‌యిత కుశ్వంత్ సింగ్ పుస్త‌కంలోని ఓ వ్యాఖ్యాన్ని ప్ర‌స్తావిస్తూ ... 18 ఏళ్ల స‌నా త‌న ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్టు చేసింది. ద ఎండ్ ఆఫ్ ఇండియా అన్న పుస్త‌కంలో ఉన్న వ్యాఖ్యాన్ని ఆమె ప్ర‌స్తావిస్తూ...ఆమె చేసి కామెంట్ పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా ఉంది. స‌హ‌జంగానే,  స‌నా ఇన్‌స్టా అకౌంట్‌కు చెందిన ఈ స్నాప్‌షాట్ బుధ‌వారం వైర‌ల్‌గా మారింది. దీంతో సౌర‌వ్ రంగంలోకి దిగాల్సి వ‌చ్చింది. ఆ వైర‌ల్ ఫోటో నిజం కాద‌ని బీసీసీఐ అధ్య‌క్షుడు వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు.

 

త‌న కూతురు ఇన్‌స్ట్రాగ్రాం  పోస్టు వివాదంగా మార‌డంపై బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ స్పందించారు. ``స‌నాను ఈ వివాదాల నుంచి దూరం ఉంచండి, ఇది నిజ‌మైన పోస్టు కాదు, రాజ‌కీయాల గురించి ఆమెకు తెలిసే వ‌య‌సు కాద‌ని, స‌నాను వ‌దిలేయండి`` అంటూ సౌర‌వ్ త‌న ట్విట్ట‌ర్‌లో ఓ పోస్టు చేశాడు. కూతురు చేసిన పొర‌పాటు స‌రిదిద్ధే క్ర‌మంలో గంగూలీ ప్ర‌ద‌ర్శించిన అప్ర‌మ‌త్త‌త ముందే ఉండాల్సింద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: