దిశా  కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తెలుగు సంచలనం సృష్టించిన ఘటన సమత అత్యాచారం. ఈ నెల 24న ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లప్పటూర్  గ్రామంలో సమత అనే మహిళపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే.ఈ  అత్యాచారం తెలంగాణ వ్యాప్తంగా  సంచలనంగా మారింది. ముగ్గురు నిందితులు అతి దారుణంగా సమతను అత్యాచారం చేసి అనంతరం గొంతు కోసి దారుణంగా హతమార్చారు. ఇక  సమత మృతదేహం నవంబర్ 25న లభ్యమైంది. అయితే సమత మృతదేహంపై పలుచోట్ల బలమైన గాయాలు అయ్యాయి . 

 

 

 సమత అత్యాచారం హత్య కేసులో ఏ 1 షేక్ బాబు ఉండగా... ఏ2, ఏ3 లు గా షేక్ షాబుద్దీన్.. షేక్ ముగ్దుమ్ లు  నిందితులుగా ఉన్నారు. అయితే సమత అత్యాచారం హత్య కేసుపై ప్రస్తుతం ఆసిఫాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో రోజువారీ విచారణ జరుగుతుంది. అయితే నేడు విచారణలో భాగంగా నలుగురు నిందితులను న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. అయితే తాము  ఏ తప్పు చేయలేదని పోలీసులు తప్పుడు కేసులు బనాయించారు అంటూ నిందితులు చెప్పడం సంచలనంగా మారింది. ముగ్గురు నిందితులు నేరాన్ని  అంగీకరించకుండా... తమపై పోలీసుల తప్పుడు కేసులు పెట్టారని జడ్జి ముందు  ముగ్గురు నిందితులు వాగ్మూలం ఇవ్వడంతో కేసు మరో కొత్త మలుపు తిరిగింది. 

 

 

 

 అయితే ముగ్గురు నిందితులు వాంగ్మూలాన్ని రికార్డు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే  సమత అత్యాచారం హత్య కేసులో పోలీసుల విచారణ పై ముందు నుంచి విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దిశా  కేసు తరహాలో పోలీసులు సమతా  కేసులో విచారణ జరపడం లేదని ఆరోపణలు కూడా వచ్చాయి. దిశను అత్యాచారం చేసి చంపినట్టు సమతను  కూడా అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపారని  అయినప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని బాధితురాలి కుటుంబ సభ్యులు వాపోతున్నారు. సమత దళిత బిడ్డ కాబట్టే అత్యాచారం జరిగిన దిశా  కేసులో మద్దతు తెలిపినట్లుగా తమకు ఎవరు మద్దతు తెలపడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. సమతా కేసులో నలుగురు నిందితులను ఉరితీసి  న్యాయం చేయాలంటూ కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: