ఆంధ్రలో రాష్ట్ర దొంగలు ఎప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక దొంగ వ్యాపారం చేస్తూనే ఉంటారు. అలాంటి వ్యాపారాలలో ఈ రోజు గంజాయి ముఠా గుట్టు రట్టు చేశారు ప్రకాశం పోలీస్‌లు. రాజమండ్రి నుంచి చెన్నైకు గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నట్లు ముందస్తు సమాచారం అందడంతో నిందితులను పట్టుకున్నారు పోలీసులు. గంజాయి లారీని పోలీసులు గమనించారు అన్న విషయము తెలుసుకుని నిందితులు దారి మళ్లించారు. పరారైన మరో ఇద్దరు నిందితులు నెల్లూరు జిల్లా గూడూరు వరకూ ఛేజ్‌ చేసి నిందితులను పట్టుకున్న పోలీసులు. ఈ నిందితులంతా తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తింపు. లారీతోపాటు సుమారు రూ.25 లక్షల విలువ చేసే 400 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల పట్టపగలు సినీ ఫక్కీలో ఛేజింగ్‌ చేయవలసి రావడము విశేషము.


 
తమిళనాడు నిందితులు గంజాయి అక్రమ రవాణాపై ప్రకాశం జిల్లా పోలీసులు పసిగట్టి  మరోసారి పంజా విసరడం జరిగినది.. ఈనెల 10న జె.పంగులూరు పోలీసుస్టేషన్‌ పరిధిలో హైవేపై బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 200 కేజీల గంజాయిని పట్టుకున్న విషయం తెలిసిందే.ప్రజలు చూడడానికి సొంత వెహికల్ లో వెళ్తున్నారు అని మనము అనుకుంటాము.కానీ అందులో కూడా దొంగ వ్యాపారం చేస్తున్నారు అన్నది ఎంత మందికి తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్రంలోని తేని జిల్లా కంభం గ్రామానికి చెందినటు వంటి ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఇది జరిగి వారం రోజులు మాత్రమే అయినది. మళ్లీ ఇప్పుడే రాజమండ్రి నుంచి తమిళనాడు రాష్ట్రానికి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న లారీని పట్టపగలు సినీ ఫక్కీలో వేటాడి, వెంబడించి పట్టుకున్నారు పోలీసులు. 

 

దాదాపు రూ.25లక్షల విలువచేసే 400 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసుల సమాచారం. రాజమండ్రి నుంచి తమిళనాడు రాష్ట్రానికి గంజాయి లారీ వెళుతున్నట్లు సమాచారం అందుకున్న ప్రకాశం జిల్లా పోలీసులు త్రోవగుంట–చీరాల జాతీయ రహదారిపై తనిఖీలు ముమ్మరం చేశారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించడం జరిగినది. అనుమానం తో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా లారీని చీరాల వద్దనుంచి పక్కదారి మళ్లించినట్లు పోలీసులకు తెలియచేయడం జరిగింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: