దిశ హత్యకేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది.  దిశ నిందితులు కేవలం దిశ హత్యకేసులోనే కాకుండా ఇంకా 9 హత్యలతో సంబంధం ఉందేమో అని పోలీసులు ఆరాతీస్తున్న సంగతి తెలిసిందే.  ఈ దిశగా పోలీసులు ఆరాతీస్తున్నారు.  దిశ కేసులో నిందితులను ఇప్పటికే పోలీసులు డిసెంబర్ 6 వ తేదీన సీన్ కన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో పారిపోవడానికి ప్రయత్నించగా వారిని కాల్చి చంపారు.  


ఇలా నిందితులను కాల్చి చంపిన రోజున తెలంగాణ పోలీసులను హీరోలుగా చూశారు.  చట్టం ముందు అందరూ సమానమే అన్నట్టుగా దిశ కేసు నిందితులను కాల్చి చంపిన పోలీసుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ ఎన్ కౌంటర్ పై సుప్రీం కోర్టు జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది.  దీనికోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.  ఈ కమిటీకి ఆరునెలల సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే.  


ఈ కమిటీ విచారణ పూర్తయ్యే వరకు కోర్టులు, సంస్థలు ఎవరి కూడా ఎలాంటి విచారణ జరపకూడదు అని చెప్పి సుప్రీం కోర్టు ఆదేశాలు జారే చేసిన సంగతి తెల్సిందే.  ఇదిలా ఉంటె, దిశ నిందితుల కుటుంబాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్, కస్టోడియల్ డెత్ కింద నాలుగు కుటుంబాలకు రూ. 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.  


గతంలో ఓ న్యాయవాది ఈ విషయంలో దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.  మరి దీనిపై ఎలాంటి విచారణ చేస్తుందో చూడాలి. తమ కుటుంబాలకు ఆసరా లేకుండా పోయిందని, కనీసం తమ పిల్లలను చూపించకుండా, కనీసం తమకు ఎలాంటి సూచనలు ఇవ్వకుండా ఎన్ కౌంటర్ చేశారని, ఇది దారుణమైన విషయం అని చెప్పి నాలుగు కుటుంబాల సభ్యులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  మరి దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: