ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే తప్పేంటి అంటూ ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో కామెంట్లు చేసిన విషయం అందరికీ తెలిసినదే. దీంతో జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు జనసేన పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కమ్మ సామాజిక వర్గం పై సీఎం జగన్ కక్ష కట్టారని అందువల్ల అమరావతిలో రాజధాని లేకుండా చేద్దామని చూస్తున్నారని అమరావతిలో రాజధాని ఉంటే తప్పు ఏంటి అంటూ అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వం పై నిరసనలు చేపడుతున్నారు.

 

మరోపక్క వైసీపీ నేతలు రాజధాని అంటే అన్ని వర్గాలకు చెందినది అని అభివృద్ధి అనేది ఒక చోట మాత్రమే చేస్తే గతంలో హైదరాబాద్ విషయంలో జరిగిన తప్పు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు ఉంటే తప్పేంటి అని అసలు అమరావతిలో ఉన్న రాజధాని ఎవరు తరలించటం లేదని లెజిస్లేటివ్ క్యాపిటల్ గా అమరావతిని చేస్తూ మిగతా రెండు చోట్లా అనగా విశాఖలో మరియు కర్నూల్ లో రాజధాని ఏర్పాటు చేస్తే తప్పేంటి అని అంతటా అభివృద్ధి జరగాలన్నది జగన్ ఉద్దేశమని...కేవలం ఒక వర్గానికే అభివృద్ధి దాసోహం కాకూడదని కమ్మ సామాజిక వర్గాన్ని జగన్ టార్గెట్ చేయడం ఏంటని ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అందరికీ సంబంధించినది అన్ని వర్గాలకు సంబంధించింది అభివృద్ధి ప్రతిచోట జరగాలని టిడిపి నాయకులు వేస్తున్న డైలాగులకు వైసీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు.

 

ఇటువంటి తరుణంలో జనసేన పార్టీ నాయకుడు మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల పరోక్షంగా జై కొట్టినట్లు సమాచారం. మహారాష్ట్రలో నాగపూర్ లో వింటర్ శాసనసభ సమావేశాలు జరుగుతుంటాయని, అప్పుడు అదికార యంత్రాంగం అంతా అక్కడకు వెళుతుందని మాజీ పోలీసు ఉన్నతాదికారి,సిబిఐ మాజీ జెడి వి. లక్ష్మీనారాయణ చెప్పారు. దీనివల్ల వివిధ ప్రాంత ప్రజలకు అదికార యంత్రాంగం అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు. ముంబైతో పాటు పూణె లో కూడా కొన్ని ఆపీస్ లు ఉంటాయని ఆయన అన్నారు. మహారాష్ట్ర లో పనిచేసిన అనుభవం తో ఈ విషయం చెబుతున్నానని  అన్నారు.

 

అలాగే హైకోర్టు కూడా ముంబైతో పాటు నాగపూర్ లో కూడా బెంచ్ ఉంటుందని, ప్రజలకు అది వెసులుబాటు కల్పించిందని ఆయన అన్నారు. కర్నూలులో ఒక అసెంబ్లీ సెషన్ కూడా నిర్వహించవచ్చని ఆయన అన్నారు.విశాఖలో కూడా ఒక అసెంబ్లీ సెషన్ ఉండవచ్చని అన్నారు. జనరల్ గా సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు ఒకే చోట ఉంటాయని, వాటి ఎక్స్ టెన్షన్ ఇతర ప్రాంతాలలో ఉండవచ్చని ఆయన అన్నారు. ఇలా చేయటం వల్ల ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా తమ ప్రాంతంలో అభివృద్ధి జరిగింది అన్న వాతావరణం లో ఉంటుందని ఏపీ ప్రభుత్వం తీసుకుంది మంచి నిర్ణయమే అన్నట్టుగా జేడీ లక్ష్మీనారాయణ చెప్పినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: