దిశ హత్యాచారా ఘటనలోని నిందితుల కుటుంబాలు డబ్బులను డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక నిందితుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని సుప్రీం కోర్టు లో పిటిషన్ వేశారు. ఎన్ కౌంటర్ చేసిన పోలీసుల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జొల్లు నవీన్ తల్లి జొల్లు లక్ష్మీ... జొల్లు శివ తండ్రి జొల్లు రాజయ్య, చింతకుంటల చిన్నకేశవులు తండ్రి కూర్మన్న, మహ్మద్ ఆరిఫ్ తండ్రి పింజారి హుస్సేన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఎన్ కౌంటర్ జరగక ముందు హత్యాచారా నిందితులు పోలీసులపై రాళ్లు విసిరారని, తుపాకులు లాక్కున్నారని రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ ఒట్టి బూటకం అని నిరూపించే ఉద్దేశంతో కోర్టుని ఆశ్రయించారు నిందితుల తల్లిదండ్రులు. వారి పిటిషన్లను పి.వి.కృష్ణమాచార్య, ఆర్. సతీష్ ద్వారా కోర్టు లో దాఖలు చేసారు.

అలాగే నిందితుల కుటుంబాలు తమ ఒక్కొక కుటుంబానికి రూ.50 లక్షలను పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేసారు.

'నలుగురు నిందితులు అందరూ అమాయకులు. కేవలం ప్రజలను శాంతపరచడానికే.. నలుగురు అమాయకులను పోలీసులు అరెస్ట్ చేసి వారిని ఎన్ కౌంటర్ చేసారు. ఆధారాలన్నీ మాయం చేసి.. నిజంగా అత్యాచారం, హత్య చేసిన వారిని రక్షిస్తున్నారు. అసలు దిశను నిజంగా రేప్, హత్య చేసిన వాళ్ళని పోలీసులు పట్టుకోలేక పోయారు.' అని దాఖలు చేసిన పిటిషన్ లో నిందితుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

అలాగే నిందితుల కుటుంబాలు.. వారి పిల్లలు నేరం చేశారనడానికి స్పష్టమైన ఆధారాలు లేవని.. అసలు వారి పిల్లలకు దిశ రేప్, హత్య ఘటనకు సంబంధమే లేదని ఆరోపించారు. తెలంగాణ కమీషనర్ అఫ్ పోలీస్ సీవి సజ్జనార్ ని ఎన్ కౌంటర్ కేసు లో జోక్యం చేసుకోకుండా, దిశ కేసులోని ఆధారాలను సేకరించకుండా ఉండేట్లు అతన్ని ఆపాలని నిందితుల కుటుంబ సభ్యులు కోర్టును కోరారు. బాధితుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలంటూ ఇప్పటికే మరో న్యాయవాది ఈ అంశం గురించి సుప్రీంకోర్టులో ప్రతిపాదించారు. అయితే, అప్పుడు సుప్రీంకోర్టు ఈ ప్రతిపాదను తిరస్కరించింది.


ప్రస్తుతానికి.. ముగ్గురు అధికారులు ఉన్న ఒక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి ఎన్ కౌంటర్ పై ఆరా తీయమని సుప్రీం కోర్టు ఆదేశించింది. దిశ కేసు, ఎన్ కౌంటర్ విచారణ మొత్తం మాజీ అపెక్స్ కోర్టు న్యాయవాది సిరిపుర్కర్, మాజీ బాంబే హై కోర్టు న్యాయవాది రేఖ.ఎస్. బెల్డోట, మాజీ సిబిఐ డైరెక్టర్ కార్తికేయన్ నేతృత్వంలో జరుగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: