పవన్ కల్యాణ్...యూటర్న్‌లు తీసుకోవడంలో చంద్రబాబునే మించిపోతున్నారా? అంటే ఆయన మాటలు వింటుంటే అవుననే అనిపిస్తుంది. ఇప్పటికే చాలాసార్లు ఆయన యూటర్న్‌లు తీసుకున్నారు. కానీ చంద్రబాబుతో పోలిస్తే ఆయన తక్కువ కాబట్టి అంతగా హైలైట్ కాలేదు. కానీ ఇప్పుడు రాజధాని విషయంలో మాత్రం అడ్డంగా దొరికిపోయారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ది చెందాలనే ఉద్దేశంతో సీఎం జగన్...రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే బాగుంటుందని అసెంబ్లీలో తన అభిప్రాయాన్ని చెప్పారు.

 

అయితే జగన్ అలా చెప్పారో లేదో ఆ వెంటనే చంద్రబాబు ప్రెస్ మీట్‌లో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇక ఆతర్వాత పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లోకి వచ్చి మూడు రాజధానుల కాన్సెప్ట్‌పై సెటైర్లు వేశారు.  ఒక్క అమరావతికే దిక్కు లేదు కానీ, జగన్ రెడ్డి మూడు అమరావతులు అంటున్నారు. అది సాధ్యమయ్యే పనేనా?’ అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. దీంతోపాటు ‘ప్లీనరీలో అమరావతికి ఓకే అన్నందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెబుతారా?. మాట తప్పను..మడమ తిప్పను అంటే ఇదేనా?. కేంద్రం అమరావతిని గుర్తించింది. మ్యాప్‌లో మార్పు చేసింది.

 

‘హై కోర్ట్ కర్నూల్‌లో ఉంటే శ్రీకాకుళం నుండి కర్నూల్‌కి వెళ్లాలా ? అనంతపురం నుండి ఉద్యోగులు విశాఖపట్నం వెళ్లి ఉద్యోగాలు చేయాలా? సామాన్య ప్రజలకు ఏదైనా కోర్టు, లేదా సెక్రటేరియట్‌లో పని ఉంటే వెళ్ళటం సాధ్యమయ్యే పనేనా?’ అని కూడా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు ఎగతాళిగా మాట్లాడుతున్న పవన్...అంతకముందు కర్నూలు పర్యటనకు వెళ్లినప్పుడు... అమరావతి రాజధానిగా ఉన్న తన మనసుకు కర్నూలునే రాజధాని అని చెప్పారు.

 

అప్పటిలోనే కర్నూలు రాజధానిని కోల్పోయిందని..జనసేన ప్రభుత్వం వస్తే కర్నూలుని అనుకున్నదానికంటే ఎక్కువే అభివృద్ధి చేస్తానని మాట్లాడారు. ఇక అప్పుడు అలా మాట్లాడినా పవన్..ఇప్పుడు జగన్ ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్ధం కావడం లేదు. ఇక ఇదే విషయంపై పవన్‌ని సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. మొత్తానికి చూసుకుంటే పవన్...తన పార్ట్‌నర్ చంద్రబాబు దారిలోనే పయనిస్తున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: