విశాఖపట్నాన్ని రాజధానిగా చేసుకోవటానికి జగన్మోహన్ రెడ్డి చాలా వేగంగా పావులు కదుపుతున్నారు. అసెంబ్లీలో మూడు ప్రతిపాదనలు అన్నట్లు జగన్ చెప్పినా లోలోపల మాత్రం ముందుగానే సీరియస్ గా పెద్ద కసరత్తే చేసినట్లు సమాచారం. జగన్ నోటివెంట ప్రకటన రావటమే ఆలస్యం అందిరకీ అర్ధమైపోయింది వైజాగే రాజధాని అని. ఎందుకంటే జగన్  ఏదో గాలిమాటలు చెప్పే రకం కాదని అందరికీ తెలుసు.

 

ఇక ప్రస్తుత విషయానికి వస్తే రాజధానిని వైజాగ్ కు తరలించటానికి పక్కా వ్యూహం రెడీ చేసినట్లు తెలుస్తోంది. అవకాశం ఉంటే వచ్చే ఉగాదికి విశాఖపట్నం రాజధాని అయిపోవటం ఖాయమేనట. ఎలాగంటే  విశాఖ నగరానికి ఆనుకునే ఉండి సబ్బవరం, కాపులుప్పాడ ప్రాంతాల్లోని  ప్రభుత్వ భూముల వివరాలను ప్రభుత్వం తెప్పించుకుంది.

 

పై రెండు ప్రాంతాల్లో కూడా చెరో 200 ఎకరాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అలాగే  విశాలమైన భవనాలు కూడా అందుబాటులో ఉన్నాయట. కాపులుప్పాడ ప్రాంతంలో  చాలా ఐటి కంపెనీలున్నాయి. వీటిల్లో అనువైనదాన్ని ప్రభుత్వం ఎంచుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని సమాచారం. అలాగే నగరానికి కేవలం 16 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న  భీమిలీలో కూడా పెద్ద పెద్ద ఐటి కంపెనీలున్నాయి. ఇందులో కొన్ని ఖాళీగా ఉన్నాయట. ప్రభుత్వం కావాలంటే కుదరదని చెప్పేవాళ్ళుంటారా ?

 

ఇక వీటిని పక్కనపెట్టేస్తే విశాఖపట్నం మెట్రో పాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ (విఎంఆర్డి)కి ఉన్న 11 అంతస్తుల భవనంలో ఓ మూడు అంతస్తులను ఖాళీ చేయిస్తే మొత్తం సచివాలయం అంతా ఒకేచోట సరిపోతుందని సమాచారం. ఈ భవనాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే ఆంధ్రా యూనివర్సిటిలో కూడా కొన్ని భవనాలు ఖాళీగానే ఉన్నాయట. వీటిల్లో ఏది కావాలని ప్రభుత్వం అనుకున్నా వెంటనే అందుబాటులోకి వచ్చేస్తాయి. ప్రభుత్వం స్పీడ్ చూస్తుంటే మౌళిక సదుపాయాలను ముందుగా చెక్ చేసుకున్న తర్వాతే అసెంబ్లీలో జగన్ ఓ మాట అన్నట్లు అర్ధమైపోతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: