మాములుగా దేశంలో ప్రపంచంలో మహిళలపై వేధింపులు ఉంటడం సహజమే.  పురుషాధిక్య ప్రపంచంలో మహిళలపై అరాచకాలు జరుగుతున్నాయి.  ఇది అందరికి తెలిసిందే.  ఇటీవల కాలంలో ప్రపంచంలో క్రైమ్ రేట్ పెరిగింది.  చిన్నా పెద్ద అనే తేడా లేకుండా మహిళలు కనిపిస్తే చాలు అత్యాచారాలు చేయడం, అరాచకాలు సృష్టించడం చేస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటె, ఇప్పటి వరకు మహిళలపై అరాచకాలు జరగడమే మనం చూశాం.  


కానీ, ఇప్పుడు పురుషులపై కూడా అరాచకాలు అజరుగుతున్నాయి. పురుషులు కూడా మానసికంగా, శారీరకంగా వేదించబడుతున్నారట.  ఇది వాస్తవం.  అలా వేదించే ఎవరో కాదు.  పక్కన ఉన్న వ్యక్తులే.  స్కూల్స్ లో కాలేజీల్లోనే కాకుండా హాస్టల్స్ లో కూడా వేధింపులు ఎక్కువైనట్టు తెలుస్తోంది.  ముఖ్యంగా గురుకుల పాఠశాలల్లో ఉండే విద్యార్ధులపై ఈ వేధింపులు ఎక్కువగా ఉంటున్నట్టు తెలుస్తోంది.  


ఐదో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 192 గురుకుల హాస్టల్స్ ఉన్నది.  వీటిల్లో దాదాపుగా 1.42 లక్షల మంది వరకు విద్యార్థులు ఉంటున్నారు.  192 హాస్టల్స్ లో అంతమంది ఉండటం అంటే మామూలు విషయం కాదు.  చాలా కష్టం కూడా.  అంటే ఒక్కో గదిలో కనీసం 30 నుంచి 40 మంది వరకు విద్యార్థులు ఉంటున్నారు.  


పక్కన ఉంటె విద్యార్థులు ఎలాంటి వారో చెప్పలేరు.  9వ తరగతి నుంచి ఇంటర్ చదివే వరకు ఉండే విద్యార్థులు తమ కంటే కింద ఉండే విద్యార్థులను లైంగికంగా, శారీరకంగా వేధిస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి అనేక కంప్లైంట్స్ వస్తున్నట్టు సమాచారం.  కంప్లైంట్స్ ఇస్తున్నా, విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇస్తున్నప్పటికీ ఈ అరాచకాలు తగ్గడం లేదని తెలుస్తోంది.  పైగా రోజు రోజుకు ఆ అరాచకాలు పెరిగిపోతూనే ఉన్నాయట.  దారుణం కదా.  అయినా తప్పడం లేదు.  చూద్దాం ఏం జరుగుతుందో.  

మరింత సమాచారం తెలుసుకోండి: