తెలంగాణ ప్రాంతానికి చెందిన ముగ్గురు కళాశాల విద్యార్థులు నేడు అకస్మాత్తుగా జలపాతంలో పడి మరణించిన ఘటన ఎంతో సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లోని వ్యవసాయ కళాశాలకి చెందిన ముగ్గురు తెలంగాణ విద్యార్థులు అనూష, రఘువంశీ, కోటిరెడ్డి తప్పిపోయినట్లు త్రయంబకేశ్వర్ తహసీల్దార్ దీపక్ గిరాస్ తెలిపారు. కాగా పలు విధాలుగా వారి గురించి గాలించినప్పటికీ వారి జాడ మాత్రం లభ్యం కాలేదని, కాగా నేడు త్రయంబకేశ్వర్ సమీపంలోని దుగర్వాడి జలపాతంలో మూడు మృతదేహాలు తేలియాడుతూ కన్పించగా, అక్కడి గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేసారని అన్నారు. 

 

కాగా కొంత సేపు తరువాత అక్కడి ఈతగాళ్ల సాయంతో ఆ మృతదేహాలను బయటకు తీసి వారి తాలూకు ఆనవాలు గుర్తించగా, అవి మూడు కూడా తప్పిన ముగ్గురు విద్యార్ధులవే అని గుర్తించి ఆ కళాశాల యాజమాన్యానికి తెలిపారు. మొన్న ఉదయం, వ్యవసాయ కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ద్విచక్రవాహనంపై నాసిక్ వచ్చి మంగళవారం మధ్యాహ్నానికి త్రయంబకేశ్వర్ చేరుకున్నట్లు అందులో ఒక విద్యార్థి  అయిన దీపక్ తెలిపాడు. మొదటగా అక్కడ దగ్గర్లో ఉన్న జలపాతం దగ్గరకు వెళ్లాలని భావించగా, అది అత్యంత ప్రమాదకరం అని మేము రాలేమని, వారిలో దీపక్ సహా మిగతా ఇద్దరూ ఒప్పుకోలేదు. 

 

మిగిలిన ముగ్గురైన అనూష, రఘువంశీ, కోటిరెడ్డి లు నాసిక్లోని తమ హోటల్కు తిరిగి వెళ్లిపోయారు. అయితే సాయంత్రమైనా వారు తిరిగి రాకపోవడం అలానే వారి ఫోన్లు పనిచేయకపోవడంతో, అనంతరం బుధవారం ఉదయం గ్రామస్థుల సాయంతో వారిని వెతకగా అనూష చెప్పులు కనిపించాయని మిగతా విద్యార్థులు చెప్తున్నారు. అనంతరం పది గంటలకు నీటిలో తేలుతున్న మృతదేహాలను గ్రామస్థులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనతో కాలేజీ యాజమాన్యం దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా, చనిపోయిన విద్యార్థుల తల్లితండ్రుల రోదనలు మిన్నంటుతున్నాయి. కాగా జలపాతాల వద్దకు వెళ్లవద్దని ఎందరు హెచ్చరించినా కొందరు విద్యార్థులు ఏ మాత్రం వినకుండా ఈ విధంగా నిండు జీవితాలు నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలీసులు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: