జగన్మోహన్ రెడ్డి చేసిన  మూడు రాజధానుల ప్రతిపాదన రాష్ట్రంలో మంటలు పుట్టిస్తోంది.  సరే జగన్ ప్రకటన రాజకీయంగా ఎవరికి అడ్వాంటేజ్ ? ఎవరికి డిసడ్వాంటేజ్ ? అన్న విషయాన్ని పక్కనపెట్టేద్దాం. అయితే చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయంతో అయినా ఇపుడు జగన్ తీసుకోబోయే నిర్ణయంతో అయినా నష్టపోయే ఓ వర్గముంది. అదే ఉద్యోగులు. నిజానికి వాళ్ళ భయం, బాధ ఎవరికీ చెప్పుకోలేకున్నారు.

 

సమైక్య రాష్ట్రం విడిపోకుండా జరిగిన ఉద్యమాల్లో ఉద్యోగులది కీలక పాత్ర. కాకపోతే అప్పటి పాలకులు, రాజకీయ నేతల చేతకాని తనం వల్లే పచ్చగా కళకళలాడుతున్న రాష్ట్రం రెండుగా విడిపోయింది. సరే మెజారిటి జనాల ఆమోదానికి విరుద్ధంగా జరిగిన విభజనలో వెంటనే నష్టపోయింది కూడా ఉద్యోగులే.

 

ఎలాగంటే పదేళ్ళ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను వదిలిపెట్టి చంద్రబాబు అర్ధాంతరంగా ఎందుకు విజయవాడకు వెళ్ళిపోయారు ? ఎందుకంటే ఓటుకునోటు కేసులో తగులుకుని అరెస్టు భయానికి హైదరాబాద్ నుండి పారిపోయారన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుండి ఉద్యోగులకు సమస్యలు పెరిగిపోయాయి. తాను విజయవాడకు వెళ్ళిపోయిన చంద్రబాబు వెంటనే ఉద్యోగులు కూడా వచ్చేయాలని పట్టుబట్టారు.  

 

చంద్రబాబు నిర్ణయం వల్ల ఉద్యోగులు హఠాత్తుగా హైదరాబాద్ ను వదిలేయాల్సొచ్చింది. చాలామంది భార్య, పిల్లలను వదిలిపెట్టి విజయవాడకు వెళ్ళిపోయారు.  భార్యా, పిల్లలు లేక భర్తలు విజయవాడలో  అవస్తలు పడుతున్నారు. అలాగే భర్త అవసరానికి దగ్గర లేకపోవటంతో భార్య, పిల్లలు హైదరాబాద్ లో ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులకు అలవాటు అవుతున్న నేపధ్యంలోనే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారు. జగన్ తెచ్చింది ప్రతిపాదనే అయినా వాస్తవరూపం దాల్చటానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

 

తాజా ప్రతిపాదనతో ఉద్యోగులు, వాళ్ళ కుటుంబాల్లో మళ్ళీ టెన్షన్ పెరిగిపోతోంది. నిజంగానే సచివాలయం, వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలు వైజాగ్ కు మారిపోతే ఉద్యోగుల కష్టాలు మరింతగా పెరిగిపోవటం ఖాయం. విజయవాడ-హైదరాబాద్ అంటే వారినిక ఒకసారి వచ్చి వెళుతున్నారు. అదే  సచివాలయం వైజాగ్ కు మారితే అంతే సంగతులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: