కాలం మారిందనిపిస్తుంది ఎందుకంటే ఇంతకాలం అమ్మాయిలకు అబ్బాయిల నుంచి లైంగిక వేధింపుల అనే వార్తలే విన్నాం. కానీ, ఇప్పుడు ప్రభుత్వ గురుకులాల్లో అబ్బాయిలే అబ్బాయిలను వేధిస్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి.

 

 

ఇక అసలు విషయం తెలుసుకుంటే సాంఘిక, గిరిజన, వెనుక బడిన తరగతుల సంక్షేమశాఖల ద్వారా గ్రామీణ విద్యార్థుల కోసం ప్రభుత్వం గురుకులాలు నిర్వహిస్తోంది. 5వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదివే విద్యార్థులు ఇక్కడే ఉంటున్నారు. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని 192 గురుకులాల్లో 1,07,832 మంది విద్యార్థులు చదువుతుండగా ఇరుకుగా ఉన్న ఒక్కో గదిలో సుమారు 40 మంది సర్దుకోవలసి వస్తుంది..

 

 

అలా రాత్రిళ్లు పక్కపక్కనే నిద్రపోతున్నారు. ఇలాంటి సమయం లో యుక్తవయస్సులో హార్మోన్ల ప్రభావం, చరవాణుల్లో నీలిచిత్రాలు చూస్తూ కొందరు విద్యార్థులు అదుపు తప్పుతున్నారు. ముఖ్యంగా 9వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదివే విద్యార్థులు కింది తరగతుల పిల్లలను లైంగికంగా వేధిస్తున్నారని అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి.

 

 

గురుకులాల్లో ఫోన్లు నిషేధించినా.. ఎలాగోలా దాచి వాడు తున్నారని చెబుతున్నారు. ఇకపోతే వసతిగృహాలకు వార్డెన్లుగా ఉపాధ్యాయులే ఉండటం వల్ల వారు సమయం కాగానే వెళ్లిపోతుంటారు. దాంతో పర్యవేక్షణ వ్యవస్థ బలహీనంగా ఉండి.. తప్పుడు ఆలోచనలు ఉన్నవారికి అవకాశంగా మారుతోంది.

 

 

విద్యార్థులు ఇంటికి వచ్చినప్పుడో,  తల్లిదండ్రులు వసతి గృహాలకు వెళ్లినప్పుడు అనుమానం వచ్చి ప్రశ్నిస్తేనో సీనియర్ల చేష్టల గురించి చెబుతున్నారు. ఇకపోతే చదువులో భాగంగా సెక్స్‌ గురించి పిల్లల వయస్సుకు తగ్గట్లు తెలియజేయాలి. కొందరు ఉపాధ్యాయులు ఈ పాఠాల బోధనను సీరియస్‌గా తీసుకోవట్లేదు.

 

 

యుక్తవయస్సులో హార్మోన్ల ప్రభావం, అంతర్జాలం ద్వారా ప్రేరేపితులై.. లైంగిక వాంఛలు తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వసతిగృహాల్లోనే కాదు.. జైళ్లు, ఇతరచోట్లా ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: