రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిందితుల కుటుంబాలు గొంతెమ్మ కోరికలు కోరుతున్నాయి. సుప్రీం కోర్టును ఆశ్రయించిన దిశ కేసు నిందితుల కుటుంబాలు 50 లక్షల రూపాయల చొప్పున ఒక్కో మృతుడి కుటుంబానికి చెల్లించాలని పిటిషన్ ను దాఖలు చేశాయి. నిందితులలో ఒకరైన చెన్నకేశవులు భార్య మొదట నా భర్త పోతే పోయాడు. పది లక్షల రూపాయల ఆర్థిక సాయం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పించాలని కొన్ని రోజుల క్రితం డిమాండ్ చేసింది. 
 
ఆ తరువాత తనకు తక్షణ సాయం కింద ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిన చెన్నకేశవులు భార్య  తనకు జాబ్ కూడా ఇప్పించాలని డిమాండ్ చేసింది. నిందితుల కుటుంబాలు కోర్టుల ద్వారా శిక్ష వేయకుండా పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపారని 50 లక్షల రూపాయలు ఒక్కో కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేశాయి. 
 
సుప్రీం కోర్టులో కొన్ని రోజుల క్రితమే ఒక లాయర్ దిశ హత్య కేసు నిందితుల పరిహారం గురించి ధర్మాసనాన్ని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు దిశ హత్య కేసు నిందితులపై మోపబడిన నేరం ఏదైతే ఉందో అది చాలా దారుణమైన నేరమని  వ్యాఖ్యలు చేసింది. నిందితుల కుటుంబాలు పరిహారం కోరినా నిందితుల కుటుంబాలకు పరిహారం లభించే అవకాశం మాత్రం లేదని సమాచారం. 
 
ఏదో దేశం కోసం పోరాడి చనిపోయినట్లుగా నిందితుల కుటుంబాలు పరిహారం అడుగుతూ ఉండటం గమనార్హం. దిశ తరహాలోనే 9 మందిని అత్యాచారం, హత్య చేసిన క్రూరమైన ఇలాంటి నిందితుల కుటుంబాలకు పరిహారం ఇస్తే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంతో పాటు నిందితుల కుటుంబాలు కూడా ఇదే విధంగా ఆర్థిక సాయం డిమాండ్ చేసే అవకాశం ఉంది. హైవేల వెంబడి వేశ్యలు, హిజ్రాలు, చాలా మంది మహిళలను వేధించామని చెప్పిన దిశ హత్య కేసు నిందితుల కుటుంబాలకు ఎట్టి పరిస్థితులలోను పరిహారం ఇవ్వకూడదని ప్రజల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: