ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీ  శీతాకాల సమావేశాలు చివరి రోజు  సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక సంచలనమైన ప్రకటన ఒకటి రాజధాని విషయం లో చేసారు. ఆ ప్రకటన ఆంధ్ర దేశంలో ప్రజలను  పలు అనుమానాలకు,  ఆవేదనకు దారి తీస్తున్నాయి. ఎన్నికలు ముగిసి వైస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం కూడా తెలుసు.  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు అధికారపక్షం మరియు ప్రతిపక్షం ఇప్పుడు తిట్టుకోవడం ఒకరి పైన ఒకరు విమర్శించడానికె సరిపోయింది.

అయితే అంధ్రప్రదేశ్  రాజకీయాలన్నీ ఇప్పుడు రాజధాని చుట్టూ తిరుగుతున్నాయి నిన్న జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజు సీఎం జగనే 3 రాజధానుల ప్రతిపాదన తేవడంతో రాజకీయాలలో మరియు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు  ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. గతంలో అమరావతిని సమర్ధించిన జగన్ ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని టీడీపీ నిలదీస్తోంది. కానీ జగన్ అమరావతి రాజధాని యధాతదం అని కాని అమరావతి తో పాటు మరో రెండు రాజధానులు కూడా రావొచ్చు అని ప్రకటించారు.

బీజేపీ నేతలు  సీఎం జగన్ ప్రకటన గందరగోళానికి దారి తీసిందని ఆరోపించింది. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల్ని ఏం చేస్తారని ఆ పార్టీ నేతలు ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని తన ఆస్తులు కాపాడుకునేందుకు ఏపీకి అన్యాయం చేస్తున్నారని టీడీపీ  పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. విశాఖలో వైసీపీ నాయకులు భూములు కొనిపెట్టుకున్నారని అందుకే రాజధాని అక్కడికి మార్చారని విమర్శించారు. మొత్తానికి రాజధాని అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. పార్టీల వారీగా ఎవరి వాదన వాళ్లు వినిపిస్తున్నారు. అటు అమరావతి ప్రాంత రైతులు మాత్రం తమను నట్టేట ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాని వైస్సార్ పార్టీ నాయకులు మాత్రం సీఎం జగన్ మాటల్ని చంద్రబాబు వక్రీకరిస్తున్నారు అని  విమర్శించారు రాజధాని ప్రాంత రైతులు టీడీపీ, జనసేన చేసే ఆరోపణలను కొట్టిపడేయాలని  సూచించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: