కొందరి బుద్ధులు అంతే.. మారవు. కన్నకొడుకు అత్యాచారం చేసి హత్య చేశాడు అని తెలిసినప్పుడు చంపేయండి అని అన్న తల్లితండ్రులు వాళ్ళని చంపేశాక నష్ట పరిహారం కావాలంటుంది. అది కూడా 50 లక్షల రూపాయిలు నష్టపరిహారం అడుగుతున్నాయి ఆ నాలుగు కుటుంబాలు. అసలు ఏంటి అనుకుంటున్నారా ? 

 

ఇంకా అసలు విషయానికి వస్తే.. గత నెల 27వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో చికిత్స నిమిత్తం బయటకు వెళ్లిన వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు లారీ డ్రైవర్లు కలిసి సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి పెట్రోల్ పోసి ఆమె శవాన్ని ముట్టుకొనేకి కూడా లేకుండా పెట్రోల్ పోసి కాల్చిపడేశారు ఆ నీచులు. 

 

అయితే ఆ నీచులను కేవలం 24 గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారు. దీంతో ఆ నిందితులను కోర్టులో హాజరుపరచగా ఆ నిందితులను 14 రోజులు రిమాండ్ లో ఉంచాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే విచారణలో భాగంగా ఆ నీచులను సిన్ రికర్రెక్షన్ కోసం ఘటన స్థలంలోకి తీసుకురాగా ఆ సమయంలో ఆ నిందితులు పారిపోవాలని చూసి పోలీసులపై దాడి చెయ్యడం వల్ల పోలీసులు ఆత్మరక్షణ కోసం ఆ నిందితులపై కాల్పులు జరిపారు. 

 

దీంతో ఆ నిందితులు నలుగురు ఈ నెల 6వ తేదీన తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు మృతిచెందారు. అయితే ఆరోజు దేశవ్యాప్తంగా ప్రజలు అందరూ సంబరాలు చేసుకున్నారు. కానీ ఆ నలుగురు నిందితుల ఇళ్లల్లో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయి. 

 

ఆ నలుగురు నిందితుల కుటుంబాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ప్రస్తుతం ఈ నిందితుల కుటుంబలు అన్ని వారి కొడుకుపై ఎన్కౌంటర్ చేసినందు వారికీ నష్టపరిహారం ఇవ్వాలని అది కూడా 50 లక్షల రూపాయిలు ఇవ్వాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు.  అనవసరంగా తమ పిల్లలను చంపేశారని.. దీనికి పరిహారంగా ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. 

 

కస్టడీలో ఉన్నవారిని అనవసరంగా ఎన్‌కౌంటర్‌లో చంపేశారని.. ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని ఆ నిందితుల కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ ఎన్‌కౌంటర్ వెనుక తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు, మంత్రుల కుట్ర ఉందని వారు ఆరోపించారు. నిందితులను శిక్షించే హక్కు పోలీసులకు లేదని అన్నారు. 

 

కాగా గతంలోనే.. నలుగురు నిందితుల్లో చెన్నకేసువులు భార్య.. భర్త మృతి చెందిన రోజే.. నా భర్త పోతే పోయాడు.. నాకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పియాలని, 15 లక్షలు ఆర్ధిక సాయం చేయాలనీ అప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఆ నిందితులు కుటుంబాలకు నష్టపరిహారం ఇస్తారా లేదా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: