దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించిన దిశ ఎన్ కౌంటర్ కేసులో రోజురోజుకీ ట్విస్టులు పెరుగుతూపోతున్నాయి. గత నెలలో దిశా మీద అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసిన నలుగురి నిందితులని సీన్ రీ కన్స్ట్రక్షన్ పేరుతో పోలీసులు ఘటనా స్థలంలోనే వారిని ఎన్ కౌంటర్ చేసి చంపారు. దీనిపై దేశమంతటా ఎన్నో ఎంతో మంది సంతోషించారు, అలాగే చాలా మంది ఇలా పోలీసులు తమకు ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించారు కూడా.

 

 దీనిపై మానవ హక్కుల సంఘం ప్రతినిధులు ఘటనా స్థలం చేరుకొని అక్కడ విచారణ చేపట్టారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆరు నెలల లోపు మొత్తం విచారణ అయిపోయే లాగ చేయమని చెప్పింది. కానీ ఇప్పుడు అనుకోని విధంగా సుప్రీం కోర్టులో ప్రజావాజ్యం పిటిషన్లు దాఖలయ్యాయి.ఈ ఘటనపై విచారణ జరిపించాలని న్యాయవాదులు ఆర్. సతీష్ - పీవీ.కృష్ణమాచారి నిందితుల తల్లిదండ్రులతో కలిసి పిల్ దాఖలు చేశారు.

 

 బాధితులైన నలుగురు కుటుంబ సభ్యులు తరఫున సుప్రీంకోర్టులో ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వారు కోరారు. వారి కుటుంబ సభ్యులను ఉద్దేశపూర్వకంగానే కాల్చిచంపిన ఎన్ కౌంటర్ గా చిత్రీకరించారని వారు వాదిస్తున్నారు. అలాగే కస్టడీలో ఉన్నప్పుడు నిందితులను హత్య చేసినందుకు ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇప్పించాలని వారు కోరారు.

 

అలాగే సీపీ సజ్జనార్ తో సహా ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై సమగ్ర విచారణ జరిపించాలని ఈ కేసును సిబిఐకి అప్పగించాలని వారు కోరారు. అలాగే కోర్టు ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ కు అందే సాక్ష్యాలను తారుమారు చేయకుండా, అక్కడ పాల్గొన్న పోలీసులను తెలంగాణ ప్రభుత్వం కట్టడి చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: