దేశంలో ఉల్లిపాయలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.  దేశంలో ఉల్లి ధరలు కొండెక్కి కూర్చున్నాయి.  దీంతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు.  ఉల్లి కోసం గంటల తరబడి క్యూలైన్లో నిలబడి ఉంటున్నారు.  ఎంతగా ప్రయత్నం చేస్తున్నా కనీసం కొన్ని ఉల్లిపాయలు కూడా చేతికి దొరకడం లేదు అన్నది వాస్తవం.  అందుకే ఉల్లి కోసం పడే వేదన ఆవేదన అంతాఇంతా కాదు.  ఉల్లికోసం భారీ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.  


గతంలో కొంత ఇప్పుడు కొంతవరకు రేట్లు తగ్గినా ఇంకా పూర్తిగా తగ్గకపోవడంతో ఉల్లికి సంబంధించిన కొరత ఇంకా అలానే కనిపిస్తోంది.  అందుకే ఉల్లి కొరతను నివారించేందుకు కేంద్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది.  ముఖ్యంగా టర్కీ వంటి దేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకోవాలని అనుకుంది.  అనుకున్నదే తడవుగా ఉల్లిని దిగుమతి చేసుకుంటోంది.  కొన్ని రోజుల క్రితం 12వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకుంది.  ఇలా దిగుమతి చేసుకున్న ఉల్లి ఈనెలాఖరులోగా ఇండియాకు వస్తుంది.  


అలానే మరో 12500 టన్నుల ఉల్లిని దిగుమతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ఈ ఉల్లి వచ్చే నెలలో ఇండియాకు వస్తుంది.  ఈ రెండు దిగుమతుల సరుకులు ఇండియాకు వస్తే... కొంతమేరకు ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.  రాష్ట్రాల అవసరాలకు తగిన విధంగా ఉల్లిని సప్లై చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.  అన్ని రాష్ట్రాలకు కావాల్సిన ఉల్లిని ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నమాట.  కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సరైనదే అని చెప్పాలి.  


అయితే, టర్కీ నుంచి ఉల్లి దిగుమతి చేసుకోవడం విశేషం.  టర్కీతో ఇండియా కొన్ని రోజుల క్రితం జమ్మూకాశ్మీర్ విషయంలో గొడవలు చేస్తున్నది.  జమ్మూకాశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370ని వ్యతిరేకించినపుడు ఇండియా టర్కీపై కస్సుమన్నది.  అయితే, అది వేరు ఇప్పుడు ఇది వ్యాపారం కాబట్టి ఈ విషయంలో డబ్బు ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి టర్కీ కూడా ఉల్లిని ఎగుమతి చేసేందుకు అంగీకరించింది.  టర్కీ నుంచి వచ్చే ఉల్లిపాయలు ఎలా ఉంటాయో తెలిసిందే కదా.  చూడటానికి పొడవుగా దొండకాయల్లా ఉంటాయి.  సడెన్ గా చూస్తే వాటిని మనం ఉల్లిపాయలు అనుకోము.  

మరింత సమాచారం తెలుసుకోండి: